పలు గ్రామాలలో యదేచ్ఛగా మట్టిని ట్రాక్టర్ ల పై తరలిస్తున్న మట్టి మాఫియా చూసి చూడనట్లు ఉంటున్న అధికార యంత్రాంగం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన ( విశ్వం వాయిస్ )న్యూస్:-
కాట్రేనికోన మండలం పరిసర గ్రామాలలో గొల్ల గరువు, పల్లంకుర్రు కందికుప్ప కుండలేశ్వరం నడవపల్లి గొప్ప గుంట కాట్రేనికోన గ్రామాలలో యదేచ్ఛగా రాత్రి పగలు అన్న తేడా లేకుండా వరి చేలు లోని మట్టిని జె సి బి లతో తవ్వి ట్రాక్టర్ ల పై తరలిస్తున్నారని కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లు ఆర్ అండ్ బి రోడ్లు మట్టితో కప్పబడి మట్టి రోడ్లు గా కనిపిస్తున్నాయని రాత్రి పగలు అతివేగంతో యువకులు మట్టి ట్రాక్టర్ల తోలుతున్న వైకిరి చూసి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆయా గ్రామాలలోని ప్రజలు భయపడుతున్నారు రోడ్లన్నీ మట్టితో కప్పబడిన రోడ్లపై ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్న గ్రామస్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరు పెట్టినట్టు చూసి చూడనట్టు చూస్తున్నారు ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు కలుగజేసుకుని మట్టి ట్రాక్టర్ లకు కళ్లెం వేయాలని అకాల వర్షాలకు మట్టి రోడ్లపై ప్రయాణిస్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాబట్టి మండల స్థాయి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు