విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా పి గన్నవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ.ఇ.కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీలకు మంజూరైన తడిపొడిచెత్త వేసుకునేందుకు డస్ట్ బిన్ లు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సర్పంచులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత శుభ్రం తో పాటు పరిసరాల శుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు స్థానిక సర్పంచ్ బొండాడ నాగమణి ఊడిమూడి సర్పంచ్ నూక పెయ్యి ప్రసన్నకుమార్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారు నాయుడు ముంగండ పాలెం సర్పంచ్ శృంగవరపు లక్ష్మణరావు ముంగండ సర్పంచ్ కుసుమే చంద్రకళ వెంకటేశ్వరావు ఉలిశెట్టి భావి అడ్డగళ్ళవెంకట సాయిరాం దొమ్మేటి దుర్గారావు కొక్కిరి రవికుమార్ కుంపట్ల గోపి నూక పై రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు