విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని: జూన్ 4: విశ్వం వాయిస్ న్యూస్:
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, పేద వర్గాలన్నిటికీ మేలు చేసే విధంగా రాష్ట్రంలో సామాజిక సంస్కరణలకు నాంది పలికి ఎంతకాలం అణచివేతకు గురైన అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు సామాజిక న్యాయం అనే వజ్రాయుధాన్ని ముఖ్యమంత్రి వైయస్ మోహన్ రెడ్డి ప్రయోగిస్తే ఆ ఆయుధం దెబ్బకు మీరు రాజకీయంగా మాడి మసి అవ్వడం ఖాయం అని తెలిసి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వాలంటీర్లు నుంచి రాజ్య సభ వరకు సామాజిక న్యాయం ప్రజల్లోకి వెళితే మీకు మరో వందేళ్లు వరకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే కదా
కోనసీమలో మంటలు పెట్టింది
సామాజిక న్యాయం బేరి యాత్ర
ప్రారంభమైంది మే నెల 26న కోనసీమ లో మా మంత్రులు ఇల్లు మీరు తగలబెట్టి ఇచ్చింది మే 24 అంటే ఎవరి ప్రయోజనాల కోసం కోనసీమలో మీరు చిచ్చు పెట్టారన్నది సామాన్యులకు కూడా అర్థం అవుతుంది కదా. వర్గ శత్రువులు అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే కలవరిస్తున్నాడు. ఎవరికి ఎవరు వర్గ శత్రువులు మా ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడదు