Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* దైవ సేవకులకు సంక్షేమానికి పాస్టర్ ఫెలోషిప్ కృషి *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని దైవ సేవకులకు సైతం సంక్షేమ ఫలాలు అందించేందుకు పాస్టర్ ఫెల్లోషిప్ కృషి చేస్తుందని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ బిషప్ డాక్టర్ డేనియల్ పాల్ అన్నారు. మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద గల ఏసుక్రీస్తు మహిమావరణం లో జిల్లాలోని 22 మండలాల ప్రతినిధులతో ఎర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

ఈ సందర్భంగా డేనియల్ పాల్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీ ల ఎంపికకు సంబందించిన విధీ విధానాలపై సమావేశం నిర్వహించి సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండల్లాలోనూ త్వరలో దాదాపు గా ఏకగ్రీవ కమిటీలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఒకవేల ఒకరు కంటే ఎక్కువ మంది ఏదైనా స్థానానికి పోటీ పడితే రాజ్యాంగ బద్దంగా అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సంఘం లో సభ్యునిగా వున్న వారికి పాలు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. పాస్టర్ లు అనారోగ్యానికి గురైతే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే ఫెలోషిప్ తరుపున ఆ కుటుంబానికి 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఇంకా ప్రభు సేవలో బలంగా పని చేసిన వారికి ప్రోత్సాహక నగదు, అవార్డులు తదితర వాటిని అందించడం జరుగుతుందన్నారు. పాస్టర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5000 రూపాయల గౌరవ వేతనం లో కొన్ని ఇబ్బందులు వున్నాయని, వాటిని సులభతరం చేసి పాస్టర్ లను ఆదుకునే విధంగా ఫెలోషిప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఈ కార్య్రమంలో జిల్లా నాయకులు సీహెచ్ ధనరాజ్, వి. సామ్యూల్ జ్యోతి, ఎన్. ప్రభు కుమార్, యు. సుందర విజయం తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement