Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* ఆశా కార్మికులకు వేతనం 15 వేలు పెంచాలి *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:

 

విశ్వం వాయిస్ న్యూస్ – చింతూరు 7/6/2022

ఆశలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం 15 వేలకు పెంచాలనీ రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపులో భాగంగా చింతూరు లో కూడా ఆశాలు సీఐటీయూ ఆధ్వర్యంలో డిప్యూటీ డి ఎమ్ &ఎచ్ వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం రిప్రాజెంటేషన్ ఇవ్వడం జరిగింది

ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పల్లపు వెంకట్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల కాలం లో నిత్యావసర వస్తువుల ధరలు 300 రెట్లు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న 10 వేలు వేతనం లో 3 వేలు డ్యూటీ సమయం లో తిరగడానికే సరిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఆశ కార్మికులకు టిఎ డిఎ చెల్లించడం లేదని తెలిపారు దీనితో వారికి వచ్చే వేతనం తో పస్తులతో ఆశాలు డ్యూటీ లు చేయవలసి వస్తుంది అని అవేదిన చెందుతూ. ఇప్పటికయినా ప్రభుత్వం అలోచించి ఆశాల గౌరవ వేతనం 15 వేలకు పెంచాలని డిమాండ్ చేసారు వాటితో పాటుగా ఆశాల పని భారం తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లివ్ లు, మీటర్నిటి లివ్ లు అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిపిట్స్ 5 లక్షలు చెల్లించాలి,10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి, నాణ్యమైన సెలఫోన్స్ ఇవ్వాలి, పెండింగ్ వేతనాలు చెల్లించాలి, ఇచ్చే గౌరవ వేతనం ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యుటీ డి ఎం & హెచ్ వో పుల్లయ్య కు వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమం లో దారేశ్వరి, వీరమ్మ, సుబ్బమ్మ, లక్ష్మి, సీతమ్మ, జానకమ్మ, జయ తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement