విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట పట్టణం ( విశ్వం వాయిస్)
వైయస్సార్ కాంగ్రెస పార్టీ నేత పలివెల సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట లో ఉన్న ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది.అలాగే వారందరి మధ్య కేక్ కట్ చేసి సుధాకర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.మండపేట లో రాజారత్న జంక్షన్,బస్టాండ్ , కలువపువ్వు సెంటర్, పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 మంది రోడ్లపై ఉన్న నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు అందచేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఇటువంటి సేవ కార్యక్రమం లను చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తనకు స్ఫూర్తి అన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీతోట త్రిమూర్తుల కలిసి పని చేయడం ద్వారా ఆయన చేసే ప్రజా సేవా కార్యక్రమాలు నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందనిఅన్నారు. ఈకార్యక్రమంలో మండపేట మండల జెడ్. పి .టి. సి కురుపూడి భవాని రాంబాబు, మారేడుబాక సర్పంచ మట్టపర్తి గోవిందరాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీప్రధాన కార్యదర్శి వల్లూరిరామకృష్ణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులుపమిడి పల్లి నానాజీ,బేతా వెంకటేశ్వరరావు, కొండపల్లి రాజేంద్ర ప్రసాద్ ,.పైడి మల్ల రాజు,మందపల్లిరవీంద్ర,పువ్వుల సుధాకర్ , పచ్చి మ లవెంకట్రావు, లంక పవన్ తేజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.