విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయితీ కన్నాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోయి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఇర్పా వెంకయ్య కుటుంబానికి ఎటపాక మహాత్మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం తమవంతు సహకారాన్ని అందజేసి దాతృత్వం చాటుకున్నారు. అగ్ని ప్రమాద బాధితుడైన ఇర్పా వెంకయ్య కుటుంబానికి 50 కేజీల బియ్యం , కొంత నగదు , నిత్యావసరాలైన కాయగూరలు , గుడ్లు , చిన్నారులకు తినుబండారాలు మరియు దుస్తులను మహాత్మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వసంతాల శివకుమార్ , ప్రధాన కార్యదర్శి అంబోజి రామ్ మరియు కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా వితరణగా అందజేశారు. అనంతరం మహాత్మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వసంతాల శివకుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరుపేద కుటుంబం నిరాశ్రయులవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి అధికారుల ద్వారా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సర్వం కోల్పోయి , కట్టుబట్టలతో చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్న కుటుంబ పరిస్థితి తెలుసుకుని చలించి వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో క్లబ్ సభ్యులందరి సహకారంతో వితరణ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవాధ్యక్షులు అగ్నిపర్తి వెంకట్ , ఉపాధ్యక్షులు గంటా రవికుమార్ , కోశాధికారి రంభాల కార్తీక్ , క్లబ్ న్యాయ సలహాదారులు తిరువీధుల మల్లికార్జునరావు , ఇసంపల్లి శ్రీనివాస్ , క్లబ్ కార్యవర్గ సభ్యులు సతీష్ , ఆకుల నాగేంద్ర , ములిశెట్టి రమేష్ , గాదె శ్రీనివాస్ , దారా రవి , బుడిపిటి నాగార్జున , వెంకట్ తదితరులు పాల్గొన్నారు.