విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,
ముమ్మిడివరం లో లంక తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు విల్ల వీరస్వామి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈరోజు ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబు గారు లంకతల్లి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఘణంగా ముమ్మిడివరం గ్రామదేవత ప్రసిద్ధ శ్రీ లంకతల్లమ్మతల్లి తీర్థమహోత్సవాలు..
ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ లంకతల్లిఅమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది…. ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు….
గతనెల 23 నుండి ప్రారంభంఅయి జరుగుతున్న జాతర ఉత్సవాలు.. ఈ నెల 9న దండాడింపు కార్యక్రమంతో ముగుయనున్న ఉత్సవాలు…..
రాత్రి వైభవంగా జరిగిన జాగరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో గొల్ల కోటి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, పొద్దుకు నారాయణరావు, దొమ్మేటి రమణ కుమార్, నడింపల్లి శ్రీనివాసరాజు, చిక్కాల అంజిబాబు, నిమ్మకాయల విష్, వెంట్రు సుధీర్, గొల్లపల్లి గోపి, దివి తేజ, కాకి మాణిక్యం, బుల్లెట్ ప్రసాద్, విజిల్ రాజు, శేట్ విక్రమ్, దాట్ల బాబు, మొదలగు వారు పాల్గొన్నారు.