విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట పట్టణం ( విశ్వం వాయిస్ )
వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మేళ్లుచేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం లో భాగంగా మండపేట వైకాపా కార్యాలయం వద్ద రాయితీ పై యంత్ర పరికరాలును మండపేట పట్టణం మున్సిపల్ చైర్ పర్సన్ నూక దుర్గా రాణి జెండా ఊపగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రైతులకు పంపిణీ చేశారు.అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు. మండపేట నియోజకవర్గం లో 13 ట్రాక్టర్లు,8 వరి కోత యంత్రాలు,27 పవర్ టిల్లర్లు సబ్సిటి ధరకు అందచేసిన్నట్లు ఆయన తెలిపారు.రైతులకు రాయితీ ఎరువులు, విత్తనాలు ,ఆధునిక యంత్ర పరికరాలు, సాగు సలహాలు, భూసార పరీక్షలు వంటివి రైతులకు అందుబాటు లోకి తెచ్చే సదుద్దేశ్యంతోనే గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ తోట పేర్కొన్నారు. అలాగే ఏ పంట కాలంలో నష్టం జరిగినా ఆ పంట కాలంలోనే నేరుగా రైతు ఖాతాలో నష్ట పరిహారం ను జమ చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్సీ తోట తెలిపారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, సాగు సలహా కమిటి అధ్యక్షులు పుట్ట కృష్ణ బాబు, వైసీపీ నాయకులు మేడిశెట్టి దుర్గారావు, మార్ని పోసబ్బు, మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ నూక దుర్గా రాణి, ఎంపీపీ ఉండ మట్ల వాసు, రాయవరం ఎంపీపీ ఎన్. వెంకట రమణ,దూలం వెంకన్న బాబు రైతులు పాల్గొన్నారు.