Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

12 న ఆంధ్ర శబరిమలై”” 11 వ వార్షికోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, జూన్ 8, (విశ్వం వాయిస్) ;

ఆంధ్రా శబరిమలై అయ్యప్పస్వామి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 12 న నిర్వహిస్తున్నారు. అదే రోజున స్వామి వారికి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించ నున్నారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం

శంఖవరం మండలంపెదల్లాపురం పంచాయితీ శివారు సిద్ధివారి పాలెంలో గల సిద్ధి పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రా శబరిమలై ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ భూపతి కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు గురుస్వామి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ వార్షికోత్సవంతోపాటు స్వామి వారికి బ్రహ్మోత్సవాలు అదే రోజున ప్రారంభం అవుతాయి అన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అయ్యప్పస్వామి సన్నిధిలో ముఖ్య ఘట్టంగా భావించే పడినెట్టాంబడిగా పిలిచే 18 మెట్లను పంచ లోహాలతో చేసిన తాపడంతో అలంకరించి ప్రారంభిస్తా మన్నారు. తొలుత స్వామి వారిని 18 మెట్ల మీదుగా ఊరేగిస్తా మన్నారు. ఆలయ వార్షికోత్సవంతో పాటు స్వామి వారికి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇదే రోజు స్వామి వారి సన్నిధిలో వేకువ జామున 5 గంటల నుండి హెూమాలు, యజ్ఞాలు, క్రతువులను వేద పండితులు నిర్వహిస్తారని, 7 గంటలకు ఉష పూజ గావించి, 9 గంటలకు స్వామి వారికి ప్రత్యేకాభిషేకాలు నిర్వహిస్తాము అని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు 18 మెట్లకు నూతనంగా అలంకరించిన తాపడం ప్రారంభోత్సవం గావించి, 11 గంటలకు స్వామి వారికి ఊరేగింపు నిర్వహణ, 11.15 గంటలకు స్వామి వారిని ఆలయ ఆవరణలోనీ కోనేరులో చక్రస్నానం, 11.30 గంటలకు ఎన్నడూ, ఎక్కడా జరుగని రీతిలో స్వామివారికి 18 వెండి బిందెలతో గంగోత్రి స్నానం నిర్వహణ, 12 గంటలకు నవ కలశాభిషేకం గావించి, 12.30 గంటలకు స్వామికి మహా నైవేద్యం సమర్పిస్తా మన్నారు. అనంతరం 1 గంటకు ఆలయ ఆవరణలో మహాన్న సమారాధన గావించి, 2 గంటలకు ముఖ్య అతిధులకు స్వామి వారి ఆశీర్వచనం అందించడంతోపాటు, సత్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు గురుస్వామి వెల్లడించారు. స్వామి వారి గంగోత్రి స్నానంలో భాగస్వాములయ్యే భక్తులు హిందూ మత సాంప్రదాయ వస్త్ర ధారణలో పురుషులు తెల్ల పంచె, చొక్కా తువ్వాలు ధరించాలని, మహిళలు తెల్ల చీర ధరించి వచ్చిన వారు స్వయంగా స్వామి వారికి గంగోత్రి స్నాన పూజలో పాల్గోనే అవకాశం ఉంటుందని, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement