విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ శాఖల్లో నమోదైన సమాచార హక్కు చట్టం కేసులకు సంబంధించి రెండో రోజు19 కేసులకుగాను 16 కేసులను రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ రేపాల శ్రీనివాసరావు పరిష్కరించినట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి వి.బద్రీనాథ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో 3రోజుల పర్యటనలో భాగంగా కలెక్టరేటులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో సమాచార హక్కు చట్టం రెండవ అపీల్ కు సంబంధించి ఆర్టీఐ కమీషనర్.. రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు తదితర శాఖలకు చెందిన పౌర సమాచార అధికారులు, ప్రథమ అఫీలేట్ అధికారులు, అపీల్ దారులు, ఫిర్యాదుదారులతో సంబంధిత కేసులపై చర్చించండం జరిగిందని వి.బద్రీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా 2వరోజు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు తదితర శాఖలలో నమోదైన 19 కేసులకుగాను 16 కేసులను పూర్తిస్థాయిలో విచారించి, పరిష్కరించినట్లు ఆయన ప్రత్యేక కార్యదర్శి వివరించారు. మిగిలిన 3 కేసులను వాయిదా వేసినట్లు తెలిపారు. గురువారం యధావిధిగా పలు కేసులను ఆర్టీఐ కమిషనర్ విచారించడం జరుగుతుందని, సదరు కేసులకు సంబంధించిన పౌర సమాచార అధికారులు, ప్రథమ అఫీలేట్ అధికారులు, అపీల్ దారులు, ఫిర్యాదుదారులు హాజరు కావాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో ఆర్టీఐ కమీషనర్ సిబ్బంది డి.సాయి,జి.హితేష్, వెంకట్, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.