WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

వైద్యుల పనితీరుపై కలెక్టర్ ఆకస్మిక తనికి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సి హెచ్ సి నిర్మాణం పూర్తయిన ట్రాన్స్ఫార్మర్స్
లేకపోవడం గుర్తించు
– జిల్లా కలెక్టర్ కె మాధవిలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోపాలపురం:

 

గోపాలపురం, విశ్వం వాయిస్:

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పూర్తిస్థాయిలో డాక్టర్లు ,వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్న గత నెలలో కేవలం నాలుగు డెలివరీలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత పేర్కొన్నారు.

బుధవారం స్థానిక మండలం గోపాలపురంలోని కమిటీ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవి లత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తూ మౌలిక వసతులు, తగినంత సిబ్బంది ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. పూర్తి స్థాయిలో ఆసుపత్రి అభివృద్ధి చేసినా రూ.50 వేలు ఖర్చుతో ఏర్పాటు చేయవలసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల ఆసుపత్రిని ప్రారంభించడం జరగలేదన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం గుర్తించామని, తక్షణం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. ఎమ్ పి పి ఉండవల్లి సత్యనారాయణ గారు వారి నిధుల నుంచి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు అనుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ఈ ఆస్పత్రిలో జనరేటర్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు.

ఈ ఆసుపత్రిలో ఒక గైనకాలజిస్టు, ఎనస్తాలజిస్ట్, సర్జన్, ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారని, ఈ విధంగా పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండే ఆసుపత్రులు కొన్నే ఉంటాయని కలెక్టర్ మాధవీలత తెలిపారు. అయినప్పటికీ ఈ ఆసుపత్రిలో గత నెలలో కేవలం నాలుగు డెలివరీ లు మాత్రమే చేశారని, ఈ ఆసుపత్రికి నెలకు 30 డెలివరీ లు చెయ్యాలని లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ చుట్టూ పక్కల గ్రామాల కు దగ్గరలో వున్న ఈ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నాము, పేదలకు, చుట్టూ ప్రక్కల గ్రామాల వారికి అందుబాటులో వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ తనిఖీలో చికిత్స పొందుతున్న వారితో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందాలని తెలియచేశారు. ఏప్రిల్, మే నెలలో ఈ ఆసుపత్రి వైద్యుల పనితీరుని పరిశీలించడం జరిగిందని, వారి పనితీరు సంతృప్తి కారంగా లేదని గుర్తించే, ఆకస్మిక తనిఖీకి రావడం జరిగిందన్నారు.ఈ ఈ కార్యక్రమంలో

యం. పి. పి., ఉండవల్లి సత్యనారాయణ, డి. సి. హేచ్. ఎస్, సనత్ కుమారి, సీ హెచ్ సి డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement