విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్) 17;-
అల్లూరిసీతరామరాజు జిల్లా (పాడేరు జిల్లా) కలెక్టర్ సుమిథ్ కుమార్ ఐఎ యస్ కలెక్ట్ ర్ బంగ్లా లో కలిసి మండల సమస్యలతో కూడిన మోమోరాండాన్ని మండల వై యస్ అర్ కన్వీనర్ పోడియం గోపాలరావు, జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు,అరవ దివాకర్, వి.అర్. పురం మండల మాజీ టిడిపి మండల అధ్యక్షుడు గొంది చంద్రయ్య సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శుక్రవారం అంధించారు. ఈ సంధర్బంగా నాయకులు మాట్లాడుతూ పోలవరం ముంపు మండలంలో ప్రజలు పలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ముంపు ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు.
* సమస్యలు ఇవే
సుమారు రెండేళ్ల క్రితం అన్నవరం వాగు కృంగిపోయిందని , దాని వలన సుమారు 30 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్, ఫైర్ ఇంజన్ కూడా వెళ్లలేని, ఆ గ్రామాలకు రాలేని పరిస్థితి ఉందని వెంటనే కొత్త బ్రిడ్జి కి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని వారన్నారు.
* ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు కల్పించండి.
.చదువుకున్న గిరిజన హరిజన వర్గాల వారికి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యగ అవకాశాలు కల్పించాలనివారన్నారు. పోలవరం ముంపు పేరు చెప్పి రైతులకు బ్యాంక్ రుణాలు మంజూరు చెయ్యటం లేదని అన్ని వర్గాల రైతులకు వ్యవసాయ బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలని వారన్నారు.
.ఈ యడాది గోదావరి,శబరి వరదలను దృష్టిలో ఉంచుకొని బఫర్ స్టాక్ ఏర్పటు చేసి సంబంధిత అధికారులను అప్రమత్తం చెయ్యాలని వారన్నారు.
* మీ సమస్యలు పరిస్కారం చేస్తాం.
సమస్యలన్నీ విన్నా కలెక్టర్ గారు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఇప్పటికే మీ మండలాలకు సంబంచిన అన్ని సేకల వివరాలు తెప్పించుకుంటున్నామని త్వరలోనే అన్ని సమస్యలు పురస్కారం చేస్తామని కలెక్టర్ అన్నారని మణ్డల్ నాయకులు మీడియాకి వివరించటం జరిగింది.