WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు””నా పోరాటం ఆగదు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– తెలుగుదేశం మాజీ మండల అధ్యక్షులు జంగాల
ప్రజా సేవే ముఖ్యం అంటున్న మాజీ బీసి సెల్ టిడిపి
నాయకుడు మల్లికార్జున్
– పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి
– టిడిపి లో ఎన్నో పదవులు చేపట్టి ప్రజాసేవలో ఓ
ప్రత్యేకత పొందిన నాయకుడిగా
– మరికొద్ది రోజుల్లో మల్లికార్జున ఆధ్వర్యంలో టిడిపిలోకి
చేరికలు.
– ఇప్పటికే వైసీపీ కార్యకర్తలతో మంతనాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:

 

వీ.ఆర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్)

17;-అన్నవరం- ఉమ్మడివరం గ్రామాల మధ్యలో గల బ్రిడ్జి గత మూడు సంవత్సారాల నుండి వరద తాకిడికి శిథిలావస్థకు చేరుకున్నదని, నేడు బ్రిడ్జి మీద నడవడానికి కూడా అవకాశంలేకుండా పోయింది. వైసిపి ప్రభుత్వం నేటికి మూడు సంవత్సారాల పాలనలో కనీసం ఆ బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడం దురదృష్ట కరమని, ప్రభుత్వం ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తుందా…? లేక ఈ ప్రాంత గిరిజనులపై చెడు బుద్ధి తలపెట్టిందా… అని ఆయన వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం అన్నవరం బ్రిడ్జిని పరిశీలనలో భాగంగా వెళ్లి అటుగా వస్తున్న గిరిజనులకు, ప్రయాణికులకు బ్రిడ్జి ఆవశ్యకత గురించి వివరించారు. బ్రిడ్జి లేక పోతే ఈ గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలు నానా ఇబ్బందులు పడతారని అక్కడకు వచ్చిన గిరిజనులతో ఆందోళన కొంత సేపుచేపట్టారు. ఆయనకు తోడు టిడిపి సీనియర్ నాయకులు బురకా సారయ్య సహకారం అందించారు. మన్యం టైగర్ అనే ఆనంతబాబు ఈ బ్రిడ్జి గురించి ఎందుకు పట్టించు కోలేదో తనకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాంత ప్రజల ఆవశ్యకత ఏమిటో కూడా తెలుసుకోలేని స్థితిలో ప్రభుత్వ తీరున్నదని,టిడిపి మాజీ బీసీ సెల్ నాయకులు, మండల మాజీ టిడిపి అధ్యక్ష , కార్యదర్శి పదవులు చేపట్టిన జంగాల మల్లిఖార్జున్ వైసిపి ప్రభుత్వ విధానాన్ని దుయ్య బట్టేరు. మండల ప్రజలు వ్యాపారం చేయాలన్నా, విద్య, వైద్యం వారికి అందాలన్నా ప్రధాన రహదారి ఈ బ్రిడ్జి మీద నుండే వెళ్లాలని అన్నారు. వి.అర్.పురం మండల కేంద్రం నుండి కాకినాడ, రాజమండ్రి, ఇప్పుడు ఏర్పాటు చేసిన అలకురి జిల్లా పాడేరు వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మీద నుండి ప్రయాణాలు చెయ్యాలని మల్లిఖార్జున్ అన్నారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయని, మండల అధికారులతో మాట్లాడలన్నా ఈ బ్రిడ్జిని దాటి రావాలని అన్నారు.

* 43 గ్రామాల ప్రజలు పరిస్థితి ఏమిటి..?

ఈ బ్రిడ్జి ఏర్పాటు చెయ్యక పోవడం వలన మండలంలో సుమారు 43 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంలో ఉంటాయని మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టుతామని పలుమార్లు మండలంలో ప్రతిపక్షం, వామపక్ష పార్టీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటికి ప్రభుత్వానికి చలనం లేదని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తే వాగు ఉధృతంగా పరవళ్లు తొక్కుతుందని , అప్పుడు గిరిజనుల రాకపోకలు నిలిచి పోతాయని ఈ విషయం కూడా ప్రభుత్వం గుర్తించ లేదా అని అన్నారు.

 

* ఆభివృద్ధి అంటే ఇదేనా…?

ఈ ప్రాంత గిరిజన, గిరిజనేతర ప్రజలకు మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని వైసిపి ప్రభుత్వానికి మాజీ టిడిపి మండల ఆధ్యక్షులు జంగాల సవాళ్లు విసిరారు. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ఈ అన్నవరం బ్రిడ్జిని చూస్తే అర్ధమవుతోందని, ఒక్క సారి వైసిపి యం యల్య్ ధనలక్ష్మి ఈ వాగు వద్దకు వచ్చి ఇక్కడి ప్రజలకు సమాధానము చెప్పాలని ఆయన అన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం గిరిజన గ్రామాలే వర్షాకాలంలో చక్రబంధంలో చిక్కుకు పోతున్నాయని అన్నారు. గిరిజనులు ప్రతి సోమవారం మండల కేంద్రానికి వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్లాలని, మరి వర్షాకాలంలో రహదారి మార్గం లేకపోతే మేము ఎట్లా వెళ్లాలని ఇక్కడ గిరిజనులు గోడు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారని జంగాల మీడియాకు తెలిపారు

 

* ఈ మండలాన్ని 2002 నుండి అభివృద్ధి చేసిందే టిడిపినే

2002 లో కనీసం రహదారి సరిగా లేని మండలాన్ని టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, అప్పుడు మారుమూల గ్రామాలకు సైతం రహదారి మార్గాలు ఏర్పాటు చేసి వాహనాలు సైతం ఆ కు గ్రామాలకు వెళ్లే విధంగా టిడిపి ప్రభుత్వం పుణ్యం కట్టుకున్నదని అన్నారు. కానీ నేడు టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని , వైసిపి ప్రభుత్వం 20 సంవత్సారాల వెనక్కి తీసుకెల్లిందని ఈ విషయం వైసిపి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు కూడా గ్రహించాలని మల్లిఖార్జున ఆరోపణలు చేశారు.

 

* ప్రజాసేవే ముఖ్యం.

తనను మండల టిడిపి పార్టీ నాయకులు అంటి ముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని, కానీ అలాంటి వాటికి తాను ఇబ్బంది పడనని, ఒక్కడి నైనా టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని , టిడిపి ప్రభుత్వ ఆయాము లో ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు సేవలు చేశానని, మండల నాయకులు, జిల్లా, రాష్ట్ర నాయకులతో ఎన్నో సమస్యలు పరిష్కరించడంలో ప్రధమ పాత్ర పోషించడం జరిగిందని టిడిపి మాజీ మండల అధ్యక్షులు జంగాల మల్కిఖార్జున్ అన్నారు. ఏది ఏమైనా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, ఈ బ్రిడ్జి విషయంలో ఒంటరిగా నైనా పోరాటం చేసి గిరిజనులకు అండగా నిలబడతానని మీడియాకు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement