చొప్పెల్ల పి హెచ్ సి వైద్యురాలు సుమలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్) ;
గృహాల సమీప పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమలకాటు నుండి రక్షించుకోవచ్చునని చోప్పెల్ల పి హెచ్ సి వైద్యురాలు ఎం సుమలత అన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల పీహెచ్సీ పరిధిలో గల అన్ని గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా పిహెచ్సి వైద్యురాలు ఎం సుమలత, సువర్చల నాయుడు, జిల్లా మలేరియా అధికారి ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆయా గ్రామాల ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. దోమ కాటు వలన వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో దోమకాటు నుండి విముక్తి పొందవచ్చునని తెలిపారు. ముఖ్యంగా గృహాల పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి కుంటలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అలాగే పబ్లిక్ డ్రైనులలో వాడకపు నీరు ఎప్పటికప్పుడు బయటకు పోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అవగాహన కల్పించారు. దోమ కాటు వలన వచ్చే జ్వరాలపై అప్రమత్తంగా ఉండి తగు సమయంలో వైద్య సేవలు పొందాలని తెలిపారు. ముందుగా పి.హెచ్.సి ఆవరణలో ఆయా గ్రామాల ఏ ఎన్ఎమ్ లు అశా కార్యకర్తలు కు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ ఎం వి సత్యనారాయణ, కట్ట ప్రసాదు, ఆరోగ్యమిత్ర రమణ పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.