విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం: మే18: విశ్వం వాయిస్ న్యూస్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో
హెచ్.ఐ.వి పాజిటివ్ పిల్లలకు పౌష్టికాహార పంపిణీ
తేదీ 18 6 2022 స్థానిక రాజ మహేంద్ర వరం లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఆర్ టి విభాగంలో బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ హెచ్.ఐ.వి పాజిటివ్ పిల్లల కొరకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ చిన్న వయసులోనే ఈ పిల్లలు ఎయిడ్స్ బారిన పడటం చాలా బాధాకరమని ఇటువంటి పిల్లల పట్ల సమాజం ప్రేమ అనురాగాలను కలిగి ఉండాలని ఏ విధమైన వివక్షత చూపకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ పిల్లల కోసం వై ఆర్ జి ఆర్గనైజేషన్ ఎంతగానో ప్రేమిస్తూ వారికి అవసరమైన వసతులను కల్పిస్తుందని ఆర్గనైజేషన్ సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఎయిడ్స్ బారిన పడిన పిల్లలకు పౌష్టికాహారం సరిగా లేకపోవడం వలన బలహీన పడుతున్నారని తద్వారా మరణం బారిన పడే ప్రమాదం ఉందని పిల్లలకు పౌష్టికాహారం అందించవలసిందిగా yrg ఆర్గనైజేషన్ చైల్డ్ కేర్ స్పెసిల్టేటర్స్ కోరడం జరిగిందని వారి యొక్క కోరిక మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎయిడ్స్ బారిన పడిన పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల నుండి ప్రతి నెల నిర్వహించి ఈ వ్యాధిగ్రస్తులకు తాము చేయగలిగినంత సహాయాన్ని చేస్తామని ఆమె తెలపడం జరిగింది పౌష్టికాహార లో భాగంగా పిల్లలకు కంది పప్పు గోధుమ పిండి చోడిపిండి సెనగలు బెల్లం వంటి తదితర ఆహార పదార్థాలను ఇవ్వడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తద్వారా ఎయిడ్స్ బారిన పడిన పిల్లలు ఎయిడ్స్ వ్యాధిని కొంతవరకు ఎదుర్కోగలతారని ఆమె అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఈ రోగులకు వైద్యాన్ని అందిస్తున్న వైద్యులను వీరికి సేవ చేస్తున్న y r g ప్రతినిధులను ఆమె అభినందించారు అనంతరం ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన పిల్లలకు సమస్త కార్యదర్శి తాతపూడి జై శ్రీ సమస్త ప్రతినిధులతో కలిసి పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తాతపూడి జయశ్రీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్ల శివ శంకర్ సమస్త సభ్యులు రాజు మరియు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది మరియు వై ఆర్ జి ఆర్గనైజేషన్ సిబ్బంది అయినటువంటి యశోద పుష్ప పద్మ సోమరాజు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది