Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వెల్ల గ్రామాన్ని సందర్శించిన కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

 

రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్.

వెల్ల గ్రామాన్ని సందర్శించిన కోనసీమ జిల్లా కలెక్టరు హిమాన్సు శుక్లా. ఫేస్ 1 జగనన్న కాలనీ లో పర్యటి0చి, ఇండ్ల నిర్మాణాలు వేగవంతం పై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు

మార్కెట్ లో గల రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ పైకి కలెక్టర్ వెళ్లి పరిశీలించారు. వచ్చే వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రామాన్ని పరిశుభ్రతతో పాటు,పరిశుభ్రమైన నీటిని గ్రామస్తులకు అందించాలని జిల్లా కలెక్టర్ స్థానిక పంచాయితీ సిబ్బందిని ఆదేశించారు. బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా కుంగి పోయిన డ్రెయినేజీ ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వెల్ల గ్రామ మురుగు నీరు అంతా ఈ డ్రెయినేజీ గుండానే ప్రవహించాలని వర్షాలు కురిస్తే గ్రామం ముంపు బారిన పడుతు0దని గ్రామ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. వెంటనే డ్రెయినేజీ పున నిర్మాణ పనులు చేపట్టాలని పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వీరాబోయిన సూరి బాబు,మాజీ సర్పంచ్ వట్టి కూటి యేసు బాబు, వైసీపీ మండల కన్వీనర్ ఎమ్. ప్రసాద్, ఎంపీటీసీ లు స్వామి కాపు, మంచెం దేవీ, తోట వీర భద్ర రావు, వెలమర్తి రమణ, అన్యం శాంత కుమారి, ఇసుక పట్ల కిరణ్ కుమార్, పెద్దిరెడ్డి రాంబాబు, గుత్తుల రాంప్రసాద్, ఎమ్.నాగేశ్వరరావు, ఇంఛార్జి డి ఎల్ పీ ఓ రామ కృష్ణ రెడ్డి, అధికారులు,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement