Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రతి విద్యార్థి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్

స్ధానిక జగన్నాధపురట ఎమ్.ఎస్ ఎన్ చారిటిస్ క్రీడ ప్రాంగణం నందు అండర్ 14 దాసరి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషన్ పుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ క్రీడాకారుడు దాసరి మురళీకృష్ణ సహకారంతో ఎమ్.ఎస్.ఎన్ పుట్ బాల్ అసోసియేషన్ ఈ నెల 17,18 తేదీలలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ రెండు రోజులు పాటు నాకౌట్ పద్ధతి లో ఆరు టీములు పాల్గొనడం జరిగింది. పైనల్ మ్యాచ్ నందు ఎం ఎస్ ఎన్ చారిటీస్ టీమ్ తాడిపత్తి టీం పై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

బహుమతి ప్రధానోత్సం నాకు ముఖ్య అతిధి గా విచ్చేసిన విజేతలకు త్రీ టౌన్ ట్రాఫిక్ సిఐ సి హెచ్ .చైతన్య కృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు క్రీడలకు కొంత సమయం కేటాయించాలి.క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది అన్నారు.ప్రతి విద్యార్థి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన త్రీ టౌన్ ఎస్సై.ఎన్ రజనీ కుమార్ మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు తోడ్పడతాయని అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం ఎస్ ఎన్.చారిటీస్ కార్య నిర్వహణాధికారి డి. సాయిబాబు మాట్లడుతు క్రీడలు నిత్యజీవితంలో బాగం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ ఛార్జ్ , ప్రధానోపాధ్యాయులు ఎం వి ఎస్‌రామకృష్ణ, ఎంఎస్ఎన్ ఎఫ్ అసోసియేషన్ అధ్యక్షులు బి శ్రీను,సెక్రటరీ ఎన్ వి ఆర్.కిరణ్, ట్రెజరర్ గోవిందు,ప్రకాష్ బిల్డర్స్ అండ్ డెవలపర్లు అధినేత కె.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement