Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉపాధి హామీ పనుల కూలి సొమ్ములను వెంటనే చెల్లించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చింతూరు:

 

చింతూరు, విశ్వం వాయిస్ న్యూస్ జూన్,19

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మధుగురు గ్రామంలో ఉపాధి కూలీలకు రావాల్సిన ఉపాధి డబ్బులు వెంటనే చెల్లించాలని,ఉపాధి కూలీలకు కొత్త జాబ్ కార్డ్స్ మంజూరు చేసి, ఉపాధి పనులు కల్పించాలని, గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని సి.పి.యం.అల్లూరి జిల్లా కార్యదర్శి బొప్పెన. కిరణ్ డిమాండ్ చేశారు.

ఆదివారంనాడు చింతూరు మండలంలోని మదుగురు గ్రామంలో “జనం కోసం సీపీఎం.. ఇంటింటికి.. సీపీఎం”కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో గ్రామంలో ఉన్న ప్రజలు అనేక సమస్యలు వారి దృష్టి కి తీసుకురావడం జరిగింది.ఎప్పటి నుంచో మేము ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ మాకు సక్రమంగా డబ్బులు చెల్లింపులు జరగడం లేదని,చాలామందికి మా గ్రామంలో ఉపాధి జాబ్ కార్డ్స్ లేక ఉపాధి పనులు లేక ఖాళీగా ఉన్నామని,గ్రామంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉన్నదని గ్రామస్తులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.కిరణ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ఉపాధి,మంచినీటి,విధిలైట్స్,సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని, వాటిని పరిష్కారం చేయాలిసిన, అధికారు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

అధికారులు మదుగురు గ్రామంలో ఉన్న ఉపాధి,మంచినీటి, వీధి లైట్స్,రోడ్స్,సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సీసం.సురేష్,ముర్రం.రంగమ్మ,పి.సుబ్బారావు, సీతారామయ్య, సుబ్బారావు, లక్ష్మీ, భద్రమ్మ, వినోద్ తదితరులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement