Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రతిపక్ష నేతల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్)

కోనసీమజిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బండారు మాట్లాడుతూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అర్ధరాత్రి కూలగొట్టడం జగన్ ప్రభుత్వ ఆరాచకత్వానికి పరాకాష్ట. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన మీద దృష్టి పెట్టింది లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలపై దాడులు, అక్రమ కేసులు బనాయింపులతో కాలం గడపడమే సరిపోతుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బిసి సామాజిక వర్గ నేతల్ని ఈ ప్రభుత్వం వెంటాడి వేధిస్తుంది. అచ్చెన్నాయుడు , నిన్న కాక మొన్న గౌతు శిరీష , ఈనాడు అయ్యన్నపాత్రుడు ఇలా బలమైన బిసి నేతల్ని లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభుత్వం వెంటాడి వేధిస్తుంది. చోడవరం మహానాడులో అయ్యన్న మాటల్లో తప్పులు వెతికేవారు జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగంగా ఈ ముఖ్యమంత్రి ని కాల్చి పడేయ్యాలి అని చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పగలరా? వంశీ,అంబటి, కొడాలి నాని, రోజా మాట్లాడే మాటలు కన్నా, చేసే జుగుప్సాకరమైన ప్రసంగాలు కన్నా తప్పుగా అయ్యన్నగారు మాట్లాడారా? అన్ని రంగాల్లో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని గ్రామాల్లో ప్రజలు ఎన్ని బూతులు తిడుతున్నారో తాడేపల్లి ప్యాలస్ కదిలి వచ్చి జగన్ ఒక్కసారి వింటే అయ్యన్న మాట్లాడింది చాలా తక్కువే అని జగన్ కే అనిపిస్తుంది. అలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అధికార వ్యవస్థలను ప్రతిపక్షాలను వేధించడానికే వినియోగిస్తూ ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వం మర్చిపోవడం వల్లే నేడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పి నేరాలు,ఘోరాలు పెరిగిపోయాయి. దళితులు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయింది.

కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల్ని వేధించడం మాని పాలనపై దృష్టి పెట్టాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీ ని బంగాళాఖాతంలో కలిపేస్తారు.

 

ఈకార్యక్రమంలో వెదిరేశ్వరం గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యపరాజు నరసింహరాజు, రాష్ట్ర వాణిజ్య సెల్ ఉపాధ్యక్షుడు సయ్యపరాజు రామకృష్ణంరాజు, రావులపాలెం మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, వెదిరేశ్వరం యం.పి.టి.సి.గంటా సుబ్బారావు, కర్రి రామకృష్ణారెడ్డి, కర్రి వెంకటరెడ్డి, పెనుమాళ్ళ అన్నవరం,గుమ్మడి రాజబాబు, భట్నవిల్లి సత్యనారాయణ, తోరం రవి, గుమ్మడి జాన్, హరీష్, పణీకృష్ణ మొదలగువారు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement