విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ సమీపంలో రెల్లి యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే గణపతి నవరాత్రుల మహోత్సవం లో మొదటి గట్టం పందిరి రాట కార్యక్రమం ఈ రోజు గ్రామ పెద్దలు రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగురి మునిరెడ్డి సి ఆర్ సి కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రెల్లి యూత్ సభ్యుడు బంగారు మధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవరాత్రులు నిర్వహించడం అనవయతీ గా వస్తుంది అని గ్రామ పెద్దలు నాయకులు ప్రజల సహకారం తో గత సంవత్సరం 36 అడుగుల గణపతి విగ్రహం ఖైరతాబాద్ తరహాలో ఇక్కడ స్వామి వారు పూజలు అందుకున్నారు అని ఈ సంవత్సరం 10 వ వార్షికోత్సవం సందర్బంగా 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తాం అని తెలిపారు ఉపసర్పంచ్ మునిరెడ్డి, సి ఆర్ సి కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ దైవ కార్యక్రమం చెయ్యాలి అంటే ఎంతో అనుగ్రహం ఉండాలి అని అటువంటి కార్యక్రమం చేస్తున్న రెల్లి యూత్ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటామని రెల్లి యూత్ సభ్యులు అభినందించారు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణపతి నవరత్నాలు దిగ్విజయంగా పూర్తిచేయాలని ఆ గణపతి స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రాజలపూడి సతీష్, కొవ్వూరు కోరిబాబు,రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, సి ఆర్ సి ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి, బంగారు అప్పారావు, బంగారు మధు,ఇంటి శ్రీను, యర్రంశెట్టి వీర్రాజు,బంగారు లక్ష్మణ్ రావు, బంగారు యేసు తదితరులు పాల్గొన్నారు…