విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
*కాకినాడ :* వాయిస్ న్యూస్
వివిధ కేసులలో స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యంను కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు ఆధ్వర్యంలో పి. శ్రీనివాస్,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, కాకినాడ జిల్లా మరియు యం.జయరాజు, అసిస్టెంట్ కమీషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి సమక్షంలో ధ్వంసం చేశారు.11 కేసులకు సంబందించి 3847.66 లీటర్ల అక్రమ మద్యం ను యం. రాంబాబు, ఇంచార్జ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, కాకినాడ, సెబ్ అధికారులు, పోలీసు అధికారులు మరియు మద్య వర్తుల సమక్షంలో సిబ్బంధి సహాయంతో ధ్వంసం చేయడమైనది.
ఈ కార్యక్రమం తుని మండల పరిధిలో గల తేటగుంట గ్రామ శివారులో గల ఖాళీ ప్రదేశంలో నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నాటు సారాయి, అక్రమ మద్యం నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇప్పటికే గుర్తించిన పలు గ్రామాలను ఎబిసి జోన్ల వారీగా విభజించి నిర్దిష్ట కార్యచరణతో ముందుకు సాగడం జరుగుతుందని, చట్టపరమైన చర్యలతో పాటు గ్రామాలలో ప్రజలకు యువతకు “పరివర్తన” కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుండి మరలే విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.