విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
విశ్వం వాయిస్ న్యూస్
వరద ముంపుకు గురైన ఇళ్ళను ఎమ్ ఎల్ ఏ వేగుళ్ళ చూసారు.బ్లీచింగ్ జల్లడం గమనించి వారికి తగు సూచనలు చేసారు. కొన్ని ఇళ్ళు పూర్తిగా పాడైపోయి కూలీపోవడానికి సిద్దంగా ఉన్న ఇళ్ళను చూసి అధికారులు ఎవరు కూడా పాడైపోయిన ఇళ్ళను ఎన్యూమురేషన్ చేయడం లేదని బాధితులు వేగుళ్ళ జోగేశ్వరరావు కు ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే వెంట వున్న తహశీల్దార్ గారితో వెంటనే ఎన్యూమురేషన్ నారాయణలంకతో పాటుగా, కేదారిలంక, వీధివారిలంక, శెరిగూడెం, అద్దంకివారిలంక, పల్లపులంకలలో కూడా పాడైపోయిన ఇళ్ళను వెంటనే ఎన్యూమురేషన్ చేయించమని ఆదేశించారు. అరటి, కూరగాయల తోటలు అన్ని కూడా లంకలలోను రైతాంగం పూర్తిగా నష్టపోయారని వారికి వెంటనే నష్ట పరిహారం ఇవ్వడానికి సర్వే చేయించమని ఆదేశించారు. ప్రభుత్వం అరకొరగా పశుగ్రాశం సరఫరా చేస్తుందని, వెంటనే పశువులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేసారు. పశు గ్రాసాన్ని మండపేట ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసారు. మరియు ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు వారితో కూడా మాట్లాడి సుమారు 10,15 స్తంబాలు నారాయణలంకకు అవసరం కనుక వెంటనే స్థంబాలు తెప్పించమని ఎలక్ట్రికల్ అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం సర్పంచ్ శాకా శ్రీనివాసు, నారాయణలంక వార్డ్ మెంబెర్ ఉరదాల త్రిమూర్తులు, మాజీ వార్డు మెంబెర్ పిల్లా శ్రీనివాస్, గంధం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.