మండపేట ఎంపీపీ పై 420 కేసు
పోర్జరీ సంతకాలపై మైనింగ్ అనుమతులు
స్థల యజమాని పిర్యాదు పై కేసు నమోదు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
పదవిలో ఉన్న మండపేట ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ చీటింగ్ చేసిన వ్యవహారం మండపేట నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన ఎంపీపీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మండలంలోని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడే ఇటువంటి మోసాలకు పాల్పడం పట్ల ప్రజల్లో చులకన భావం వ్యక్తమవుతోంది. పదవిలోకి రాకముందే అక్రమ మైనింగ్ లో ఆరితేరి కోట్లకు పడగలెత్తిన ఈ ఉండమట్ల బ్రదర్స్ అధికారంలోకి వచ్చాక మరింత రెచ్చిపోతున్నారు. చివరకు సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్లు సృష్టిస్తున్న తీరుపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీటింగ్ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన న్యాయవాది గంధం గంగాధర్ కు కేశవరం గ్రామంలో భూమి ఉంది. స్థలం లెవెల్ చేసి గ్రావెల్ తీసుకెళ్లేందుకు గంగాధర్ తో కేశవరం గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఉండమట్ల తాతాజీ, ఎంపీపీ శ్రీనివాస్ వారి బంధువు యర్రంశెట్టి శ్రీనివాస్ లు పై గతంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పటికే గడవు ముగిసి పోయింది. అయినప్పటికీ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఒప్పంద పత్రాలు సృష్టించారు. ఆపై తమకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని రెవెన్యూ అధికారుల నుండి మైనింగ్ కు అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు మొదలు పెట్టారు. తమ స్థలంలో అక్రమంగా తవ్వకాలు జరపడంపై లాయర్ గంగాధర్ ఆరా తీయగా సంతకాలు ఫోర్జరీ వెలుగు చూసింది. దీనిపై లాయర్ గంగాధర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు కావడంతో మొదట్లో పోలీసులు కేసు నమోదుకు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. అయితే న్యాయవాది తన బార్ అసోసియేషన్ ద్వారా ఒత్తిడి తీసుకు రావడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఏ1గా ఉండమట్ల తాతాజీ, ఏ2గా ఎంపీపీ శ్రీనివాస్, ఏ3గా యర్రంశెట్టి సత్తిబాబులపై 420, 468, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులు పెట్టి మూడు వారాలు అవుతున్నా అరెస్టులు చేయకుండా పోలీసులు జాప్యం చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి_…