ఐదు కిలోమీటర్ల దూరంలో పట్టాలు .. మాకొద్దు ! పట్టాలు వెనక్కు ఇచ్చేసిన మొగలికుదురు గ్రామ లబ్ధిదారులు….
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజోలు:
తహశీల్దారు వినతిపత్రం అందిస్తున్న మొగలికుదురు గ్రామానికి చెందిన లబ్ధిదారులు నవరత్నాల్లో భాగంగా తమకు అందించిన పట్టాలను మండలంలోని మొగలి కుదురు గ్రామానికి చెందిన 20 మంది లబ్ధిదారులు శుక్రవారం తహశీల్దార్ సీహెచ్ నాగలక్ష్మమ్మకు తిరిగి ఇచ్చేశారు . తమ గ్రామానికి దూరంగా ఐదు కిలోమీటర్ల దూరాన వేరే గ్రామంలో పట్టాలు ఇచ్చారని , దీనివల్ల ఆర్థికంగాను , విద్యాపరంగాను నష్టపోతామని , జీవనోపాధి కోల్పోతామని వారు తహశీల్దార్కు తెలిపారు . తమ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వినతిపత్రం ద్వారా కోరారు . అంతేకాకుండా గ్రామంలో ప్రభుత్వ భూములు అనేకం నిరుపయోగంగా ఉన్నాయని , వాటిని సేకరించి తమ గ్రామంలో తమకు పట్టాలు పంపిణీ చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు . కార్యక్రమంలో కర్రి లక్ష్మి దుర్గ , బి.రమ్మ , పిచ్చిక కోట నాగమణి , సీహెచ్ రమామణి , సలాది ఏసురాణి , కూర్మ సూర్యవతి , బళ్ల నీలవేణి , కె . లక్ష్మీనాగదుర్గ తదితరులు పాల్గొన్నారు .