విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కోరుకొండ:
బత్తుల ఆధ్వర్యంలో జనసేన మహారక్తదాన శిబిరం విజయవంతం
– శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్
కోరుకొండ,(విశ్వం వాయిస్ న్యూస్):
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆశయాలకు , సిద్ధాంతాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, రక్తదానంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని జనసేన పార్టీ రాజనగరం నియోజకవర్గ లో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి తెలిపారు. సోమవారం గాదరాడ లో జరిగిన మహా రక్తదాన శిబిరాన్ని జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ తో కలసి రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు .అనంతరం మాట్లాడిన ఆమె రక్తదానం ప్రాణదానంతో సమానం అని ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని ఇవ్వటం ద్వారా వారి తోపాటు వారి కుటుంబాన్ని కాపాడవచ్చు అని అదే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని ఆ సిద్ధాంతాలద్వారానే మేము నడుస్తున్నామని అందులో భాగంగానేగత వారంలో లక్ష జామ మెక్కలు నియెజకవర్గంలో పంచామని సోమవారంఈ మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నియోజకవర్గం నుండి పలు గ్రామాలనుండి జనసైనికులు అభిమానులు వీర మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు రక్తదానంపై అవగాహన పెంచుకొని అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ పరిణామాన్ని ఆపదలో ఉన్నవారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరో జన్మనిచ్చిన వారు అవుతామని మంచి కార్యక్రమనికి మంచి స్పందన రావడం చాలా సంతోషం అన్నారు, ధనవంతురి, సంజీవిని ,సూర్య బ్లడ్ బ్యాంకులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారుఈ రక్తాన్ని నిరుపేదల రోగుల కోసం వినియోగిస్తామని తెలిపారు అన్ని నిబంధనలకు అనుగుణంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు ,చేశామని జనసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి, ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛందంగాజన సైనికులు యువత ,అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు ముందుకు రావడంసంతోషం అని బత్తుల వెంకటలక్షి తెలిపారు ఈకార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు ,జి.ప్రశాంత్ కుమార్ ,కోనే శీను ,ముత్యాల హరీష్ ,మట్టా సుబ్రహ్మణ్యం, మట్ట కిషోర్, ప్రగాడశ్రీహరి ,గట్టి సత్యనారాయణ మూర్తి ,మాధవరపు కోటేశ్వరరావు, కొండేటి సత్యనారాయణ,తోట సూర్యమణికంఠ , సుందరపల్లి చైతన్య,పిండి వివేక్ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.