విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
కొడుకు కోసం సాయం కోరిన మహిళ స్పందించిన కలెక్టర్ హిమాన్సు శుక్లా
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 13 మహమ్మద్ మున్వీర్ అనే ముస్లిం మహిళ, తన కుమారుడిని సివి రామన్ కాన్వెంట్లో ఏడు నుండి పదవ తరగతి వరకు చదివించానని సివి రామన్ కాన్వెంట్ యాజ మాన్యం ఈ నాలుగు సంవత్సరాలు గాను రూ.90,000లు ట్యూషన్ ఫీజుగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని కుమారుడి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మార్కు లిస్టులను నిలుపుదల చేశారని సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారిని ఆశ్రయించగా మధ్యాహ్నం సివి రామన్ కాన్వెంట్ యాజమా న్యాన్ని జిల్లా కలెక్టర్ వారు కలెక్టరేట్ కు పిలిపించి నిరుపేద మహిళ ,ఆర్థిక స్తోమత లేని కారణంగా ఫీజులు చెల్లించలే కపోతోందని ఫీజులు తగ్గిస్తే చెల్లించడానికి ముందుకు వస్తుందని తెలుపుగా జిల్లా కలెక్టర్ వారి విజ్ఞప్తి మేరకు సివి రామన్ కాన్వెంట్స్ యాజమాన్యం స్పందించి రూ. 20,000 చెల్లించాలని తెలుపగా వెంటనే రూ.10,000 రూపాయలను ఆ మహిళ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు చెల్లించిందని. త్వరలో మరో 10 వేలు కూడా చెల్లిస్తానని కుమారుడు మార్కు లిస్టు, టీసీలను యాజమాన్యం నుంచి జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ఆమె స్వీకరించింది ఈ సందర్భంగా ఆ ముస్లిం మహిళ జిల్లా కలెక్టర్ వారి చొరవని అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఒక రోజులోనే సమస్య కు పరిష్కార మార్గం దొరకడం పట్ల ముస్లిం మహిళ మహ్మద్ మున్వీర్ ఎంతో గాను సంతోషం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.వి. రవి సాగర్ తదితరులు పాల్గొన్నారు.