విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
ఈగలు వాలిన ఆహారం సేవించడం వలన వ్యాధులను కలుగుతాయి….
ఎంపీపీ, హాస్పటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నౌడు వెంకటరమణ
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: ఆహార పదార్ధాలపై ఈగలు వాలినప్పుడు ఆహారం సేవించడం వలన నులిపురుగులు గుడ్లు మన దేహంలోకి చేరి వ్యాధులను కలుగజేస్తాయని రాయవరం ఎంపీపీ, హాస్పటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నౌడు వెంకటరమణ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో బుదవారం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజేశ్వరి కాలనీ ప్రైమరీ స్కూలు, అంగన్వాడి సెంటర్ నందు రాయవరం పీహెచ్సీ వైద్యాధికారిణి అంగర దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నౌడు వెంకటరమణ, సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ వెంకటరమణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసుగల పిల్లలకు అందరికీ ఉచితంగా నులి పురుగు మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మాత్రలు వేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ కలుషితమైన పండ్లు కూరగాయలను సరిగ్గా శుభ్రపరచకుండా ఆహారం తీసుకోవడం వల్ల అటువంటి ఆహారాన్ని సేవించడం ద్వారా నులిపురుగులు శరీరంలోకి చేరి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సర్పంచ్ అన్నారు. వైద్యాధికారిణి దేవి రాజశ్రీ మాట్లాడుతూ మనిషి మలవిసర్జన ద్వారా నులిపురుగులు వాటి గుడ్లు మన శరీరంలోకి చేరుతాయని ఇవి చాలాకాలం మట్టిలో సజీవంగా ఉంటాయని, పిల్లలు మట్టిలో ఆడుకున్నప్పుడు నులిపురుగులు గుడ్లు వారి గోలల్లోకి చేరి పిల్లలకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయనిమ, పిల్లలకు గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ గుడ్లు పిల్లల ఆహారం తీసుకున్నప్పుడు మన కడుపులోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయని, కాళ్లకు జోలు లేకుండా నడవడం, మరుగుదొడ్లకు వెళ్ళడం, మలవిసర్జన తర్వాత చేతులను సరిగ్గా శుభ్రపరచుకోకుండా ఆహారం తీసుకోవడం, మలమూత్రాలతో కలుషితమైన పండ్లు కూరగాయలు సరిగ్గా శుభ్రపరచకుండా ఆహారం తీసుకోవడం, విసర్జించిన వాటిని ఈగలు ఆహార పదార్థాల మీద వాలినప్పుడు అటువంటి ఆహారాన్ని సేవించడం వలన నులిపురుగులు గుడ్లు పెట్టి మన దేహంలోకి చేరి వ్యాధులు సంక్రమిస్తాయని ఆమె అన్నారు.
నులిపురుగు వ్యాధి బారిన పడిన వారి లక్షణాలు:- పిల్లల్లో కడుపు పెద్దగా ఉంటుంది, నీరసంగా ఉంటారు చలాకి గా ఇతర పిల్లల మాదిరిగా ఆడుకోలేరు, కడుపు నొప్పిఅంటూ ఉంటారు. స్కూల్ కి వెళ్లడానికి నిరాకరిస్తారు మొహంపై తెల్లని మచ్చలు వస్తాయి. రక్తహీనతగా ఉంటారు అనగా 4 కళ్ళు తెల్లగా ఉంటాయి గోర్లు స్పూన్ వలె గుంటపడి ఉంటుంది త్వరగా అలసిపోతారు ఇవన్నీ వ్యాధిని పడిన వారి లక్షణాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయవరం పరిధిలోని సుమారు 17 గవర్నమెంట్ స్కూల్స్ మరియు ఆరు ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మరియు జూనియర్ కాలేజీ పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు స్కూల్ బయట పిల్లలకు కలిపి సుమారుగా 5 వేల 500 ఇరవై ఆరు మంది పిల్లలకు 2022 సెప్టెంబర్ 21న ఆరోగ్య సిబ్బంది ద్వారా ఉచితంగా నులిపురుగు మాత్రలు ఇవ్వడం జరిగిందని వైద్యాధికారిణి దేవి రాజశ్రీ తెలిపారు ముందుగానే పిల్లలు వారి కడుపులో నులిపురుగులు ఉన్నవారికి ఈ మాత్ర తీసుకున్నప్పుడు కొద్దిపాటి ఇబ్బంది అనిపిస్తుంది ఈ మాత్రం తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎదురైన వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయవల్లని తెలియజేశారు. అనంతరం ఒక సంవత్సరం నుండి పందొమ్మిది సంవత్సరాల వయసుగల పిల్లలు అందరికీ ఉచితముగా ఆల్బెండజోల్ మాత్రలు ఎం పి పి, సర్పంచ్ చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ కృష్ణశేఖర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వాణికుమారి, ఏఎన్ఎం బుజ్జి, ఆశ వర్కర్లు తదితరలు పాల్గొన్నారు