విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
వైఎస్‌ఆర్‌సిపి నగర ప్రధాన కార్యదర్శి,14వ డివిజన్ ఇన్‌చార్జ్ పెంకే సురేష్,మాజీ కార్పొరేటర్ బాపన సుధారాణి దంపతుల ఆధ్వర్యంలో మంగళవారపు పేటలో కొబ్బరి కాయలు మార్కెట్ వద్ద శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారిగుడిలో జరిగిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి,నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ప్రారంభించారు. శ్రీదేవి శరన్నరాత్రుల ముగింపు సందర్భంగా 18వ ఏడాది అన్నదానం చేస్తున్నట్టు సురేష్ వివరించారు. దీనికి ముందు శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ మందిరంలో అమ్మవారిని దర్శించుకుని రాజా,రౌతు, మేడాపాటి తదితరులు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంకే సురేష్ మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుంచి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంప్రదాయ బద్దంగా 11 మంది ముత్తైయిదువులను అమ్మవారిగా భావించి ముందుగా ప్రసాద వితరణ చేసి తాంబూలం గా చీరలు గాజులు అందచేసామన్నారు.ఈ అన్నదానం లో 4వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారన్నారు మాకు సహకరించిన మిత్రులకు ,స్నేహితులకు,మా యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.కార్యక్రమంలో వైసిపి నాయకులు బొంత శ్రీహరి, వాకచర్ల కృష్ణ, పిల్లి నిర్మల, ఉదయ భాస్కర్, పెదిరెడ్ల శ్రీనివాస్,కోడి కోటా, నీలం గణపతి, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ రాజేష్, వైఎస్సార్సీపీ నాయకులు కురుమిల్లి స్వరూప్,నగర మైనార్టీ సెల్ కార్యదర్శి ఆరిఫుల్లాఖాన్, పొలాకి శ్రీను,పాలురి శ్రీను,జొన్నాడ విల్సన్,కిల్లంపల్లి రాజు,బోను పండు,కర్రి శీను,చల్లా గణేష్,తాళ్లూరి నారాయణ రావు, కీలారి మోహన్ మహేష్, యార్లగడ్డ నాని తదితరులు పాల్గొన్నారు.