విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
తురంగి గ్రామంలో పిడిఎస్ బియ్యం పట్టివేత
కాకినాడ రూరల్,విశ్వం వాయిస్ న్యూస్ : కాకినాడ రూరల్ మండలం తురంగి గ్రామంలో విఎస్ రెడ్డి సన్స్ గోడౌన్లో అక్రమంగా నిలవచేసిన పిడిఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులు పట్టుకున్నారు గోడౌన్లో 122 బస్తాలలో సుమారు 60.42 క్వింటాల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించారు, ఈ బియ్యంను పినపోతు రాజు, బుడంకాయల మహాలక్ష్మి లు గొల్లప్రోలు, కాకినాడ పరిసర ప్రాంతములలో గల రేషన్ కార్డు దారుల నుండి కొనుగోలు చేసి కాకినాడకు చెందిన ఆనందరెడ్డికి అమ్ముచుండగా తనిఖీ అధికారులు పట్టుకొని గోడౌన్ లో గల సుమారు రూ 3,04,710/- లు విలువ గల ఆటొ, మోటార్ సైకల్, ఒక్క కాటా మరియు 60.42 క్వింటాల పిడిఎస్(చౌక బియ్యం) ను సివిల్ సప్లయ్స్ అధికారులు సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి, కొనుగోలుదారులు అయిన పినపోతు రాజు, బుడంకాయల మహాలక్ష్మి, ఆనందరెడ్డి మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు కొరకు ఇంద్రపాలెం పోలీసు స్టేషన్ కు సిఫారసు చేశారు
ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్లు టి.శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ విజయకుమార్, హెడ్ కానిస్టేబుల్ జీవానందం, కానిస్టేబుల్స్ లోవకుమార్, ఈశ్వర్ మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు .