విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
రాజమండ్రి నగరంలోని బీసీ నాయకులను వెనక్కునెట్టి మహిళలకు,తనకు కావలసిన వారికే ఎంపీ మార్గాని భరత్ రామ్ పదవులు కట్టబెట్టి సహాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు,బీసీ నాయకులు నరవ గోపాలకృష్ణ,బర్ల సీతారత్నం, డాక్టర్ లంక సత్యనారాయణ మండిపడ్డారు.ఎంపీ, ఎమ్మెల్యే, కూడా బీసీ నాయకులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే తాము కావాలితప్ప గెలిచాక అవసరంలేదా అని ప్రశ్నించారు.ఎంపీ వెంట తిరిగే బీసీ నాయకులకు పదవులు ఇవ్వాలని,బీసీ నాయకులను గౌరవించాలని వారు కోరారు.సీఎం.జగన్ మోహన్ రెడ్డికి బీసీ నాయకుల బాధలు చెప్పాలని గంగుల సూర్యారావు ఎంపీని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.కేంద్రంలో బీసీలకు కనీసం ఒక మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తంచేశారు.రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గెలిచిన తరువాత బీసీలను దూరంగా పెడుతున్నారని, బీసీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.బీసీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు వేసే యంత్రాలు గా చూస్తున్నారని విచారం వ్యక్తంచేశారు.బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు త్వరలో రాష్ట్రస్థాయి బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు గంగుల సూర్యారావు,నరవ గోపాలకృష్ణ డాక్టర్ లంక సత్యనారాయణ చెప్పారు.అన్ని బీసీకులాలకు చెందిన నాయకులు, ప్రజలు హాజరవ్వాలని వారు కోరారు.విలేకర్ల సమావేశంలో బీసీ నాయకులు కడియాల, వీరభద్రరావు,లక్ష్మీ తులసి,రుక్మాంగదరావు,అను యాదవ్,మొల్లి వినయ కుమారి, సుహాసిని,ముంతా సుమతి,లక్ష్మి సుజాత, భాస్కరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.