విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి. గన్నవరం:
ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ పేదలను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం …..జనసేన పార్టీ డిమాండ్
పి గన్నవరం( విశ్వ వాయిస్ న్యూస్)
పేదలకు వైకాపా ప్రభుత్వం అందించిన జగనన్న కాలనీలు, ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న అవకతవకలు, అవినీతిని బట్టబయలు చేసేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శిలు వాసంశెట్టి కుమార్, మద్ద చంటిబాబు తెలిపారు. ఈ మేరకు వారు పి. గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ పి.గన్నవరం నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ మేరకు పేదలకు అందించే ఇళ్ల స్థలాల విషయంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నివాసయోగ్యంగా లేని ప్రదేశాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా అందజేశారన్నారు. ఇప్పటికే పేదల ఇళ్ల స్థలాలు గోదావరి వరద ముంపు బారిన పడుతున్నాయని ఆరోపించారు. దీనివలన ముంపు బారిన పడే ప్రదేశాలలో పేదలు ఇళ్ళు కట్టుకోవడం వలన వారు చాలా నష్టపోతారన్నారు. కేవలం ఒక ప్రదేశంలో జగనన్న లేఔట్లను ఏర్పాటు చేసి సుదూర ప్రాంతాలకు చెందిన వారిని అక్కడికి వెళ్ళమని సూచించడంతో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈ నెల 12, 13, 14 తేదీలలో జగనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇళ్ల స్థలాల లబ్ధిదారుల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించి అక్కడి లోటుపాట్లను, అవకతవకలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాత కాపు, పి గన్నవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ , (జేడి) అయినవల్లి మండల అధ్యక్షులు గుర్రాల రాంబాబు, మామిడి కుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, అంబాజీపేట మండల అధ్యక్షులు దొమ్మేటి సాయి కృష్ణ, అడ్డగళ్ల సిరి జ్యోతి సతీష్, యన్నాబత్తుల నాగరాజు, యడ్ల ఏసు భాస్కర రావు, యర్రంశెట్టి తాత కాపు, తాటికాయల శ్రీను, కొమ్ముల శ్రీనివాస్, పప్పుల సాయి బాబు, పప్పుల సత్తిబాబు, షేక్ దొరబాబు, గనిశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.