– నెల్లిపాక వైద్యాధికారి డాక్టర్ పి.ప్రత్యూష్ , డా.లావణ్య
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు. డాక్టర్ పి.ప్రత్యూష్ , డాక్టర్ లావణ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటపాక మండలం నెల్లిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రతి నెల ఒక గ్రామంలో రెండు రోజులు ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంప్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు. బాలింతలు , దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ లావణ్య , డాక్టర్ విష్ణుప్రియ తెలిపారు. చోడవరం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 104 స్టాప్ పీ.హెచ్.ఎన్ . ఏ.ఎన్.ఎమ్స్ , ఆశా వర్కర్లు , అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.