విశ్వంవాయిస్ న్యూస్, అంబాజీపేట:
జనరిక్ మందులను కార్పొరేట్ మందుల షాపులలో అమ్మకాలను తక్షణమే నిలిపివేయండి
మెడికల్ మాఫియాను అరికట్టండి
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )
ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన మందులను అతి తక్కువ ధరలకే అందించాలని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పేదలకు అందించాలని చూస్తున్న తరుణంలో ఇదే అదునుగా జనరిక్ మందులను తక్కువ ధరకే కొనుక్కుని జిల్లాలో ప్రైవేటు మందుల షపులలో , కార్పొరేట్ మందులు షాపులలో ఎమ్మార్పీ రేట్లకు అమ్ముకుని అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. మాచవరం గ్రామం అంబాజీపేటకు చెందిన దొమ్మేటి సాయి కృష్ణ ఆరోగ్యరీత్యా మందులు అవసరమై అంబాజీపేట సెంటర్ లో అపోలో మెడికల్స్ లో సాయి కృష్ణకు అవసరమైన కొనుక్కున్నారు. ఆయన ఇంటికి వెళ్లి అంతకుముందు జనరిక్ షాపులో కొన్న కాళీ మందుల స్ట్రిప్పు నిశితంగా పరిశీలించగా అపోలో మెడికల్ షాపులో కొన్న మందులు (ర్యాబిటిక్ డిఎస్ఆర్ ) అంతకుముందు జనరిక్ లో మందులు స్టీప్పు ఒకటే కావడంతో వెంటనే దొమ్మేటి సాయి కృష్ణ అపోలో మందులు షాపుకు వెళ్లి నిలదీశారు. దీంతో అపోలో మెడికల్స్ సిబ్బంది నీళ్లు నములుతు ఏం చెప్పాలో అర్థం కాక సతమతమయ్యారు. సాయి కృష్ణ వెంటనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కి సోమవారం స్పందన కార్యక్రమంలో లికిపూర్వకంగా
మందుల మాపియని ఆరిక్కట్టలని ఫిర్యాదు చేశారు.
అపోలో మెడికల్స్ , జిల్లాలో అన్ని మెడికల్ స్టోర్లలో నాణ్యమైన మందులు పేదవారికి అతి తక్కువ ధరలకే అమ్ముతున్న జనరిక్ మందులు ప్రైవేటు షాపులలో ఎమ్మార్పీ ధరలకు అమ్మడం సిగ్గుచేటని అన్నారు. మందుల మాపియని ఆరిక్కట్టలని అన్నారు.
ఈకార్యక్రమంలో మట్టపర్తి సోమేశ్వరరావు నూకపేయి సూర్య చంద్ర రావు, బొక్క రాంప్రసాద్, గుత్తులు బాల సూర్య నారాయణ,కడలి కొండా, మట్టపర్తి రమేష్ ,ములపర్తి రమేష్, ఇళ్ల నరసింహరావు, తదితరులు పాల్గొని అపోలో మెడికల్స్ లో నిలదీశారు.