విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం రూరల్:
*బ్యానర్లు తొలగించడంలో వివక్షత*
*వన్నె చింతలపూడి పంచాయతీ ,సచివాలయ అధికారులు*
అమలాపురం రూరల్ డిసెంబర్ 13 విశ్వం వాయిస్)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్లాస్టిక్ బ్యానర్ లు నిషేధిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు కొత్త సంవత్సరం జనవరి నుండి ఇది అమలు చేస్తామని చెబుతున్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం, ఉప్పలగుప్తం అమలాపురం మండలాల్లో ఉన్నప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఎవరు అయిన కొత్తగా బ్యానర్ లు పెట్టినందుకు పక్కగా పంచాయతీ కార్యదర్శి అనుమతి తీసుకోవాలంటూ ప్రకటన లు చేశారు. గ్రామాల్లో ఉన్న బ్యానర్ లు పంచాయతీ కార్యదర్శి, సచివాలయం పోలీసు అధికారులు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది తొలగించారు.ముఖ్యమంత్రి ప్లాస్టిక్ బ్యానర్ లు నియంత్రణ ప్రకటన చేసిన తరువాత చాలా మంది ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారుఅంటు హర్షం వ్యక్తం చేశారు. దానిమిదే ఆధారపడి జీవనాధారం కొనసాగుతున్న వారు మాత్రం ముఖ్యమంత్రి మరోసారి ఆలోచన చేయాలని అంటూ నిరసనలు కూడా తెలియజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా,అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి పంచాయతీ లో మాత్రం కొత్తగా బ్యానర్ లు పెట్టేటప్పుడు కచ్చితంగా పంచాయతీ అనుమతి తీసుకోవాలని గ్రామ సభలో గాని,గ్రామ వాలాంటిరీలు ద్వారా గాని ఎవరికి ఎటువంటి తెలియపరిసిన సంఘటన లే లేవు.పక్కన ఉన్న గ్రామాలు సమనస,తాండవపల్లి, చిందడాగరువు,కామన గరువు, పంచాయతీ పరిధిలో ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ బ్యానర్ లు తొలగించే పనిలో పడ్డారుపంచాయతీ అధికారులు.అదే తరహాలో వన్నె చింతలపూడి పంచాయతీ లోకూడా ఉన్న బ్యానర్ లు కూడా తొలగించారు. కానీ ఎస్సీ కాలనీ లో ఉన్న బ్యానర్ లు మాత్రమే పక్కగా తొలగించడం బాధాకరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామాల్లో బ్యానర్ లు తొలగిస్తే అన్ని బ్యానర్ లు తొలగించాలని కొంతమందిని టార్గెట్ చేసి వారు పెట్టిన బ్యానర్ లు తొలగించడం ఇది పంచాయతీ,సచివాలయం అధికారులు కక్ష సాధింపునకు నిదర్శనమని పలువురు దళితనాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యానర్ లు తొలగించినప్పటకి తొలగించిన బ్యానర్ ఫోటోలు పెట్టకుండా ఎస్సీ కాలనీలోని తొలగించిన బ్యానర్లు మాత్రమే వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసే విధంగా పెట్టడం ఏంటి అని మిగతావి తొలగించిన బ్యానర్ ఫోటోలు ఎందుకు పెట్టలేదని దీనిపై పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని దళిత నాయకులు అన్నారు.తొలగిస్తే అన్ని బ్యానర్ లు తొలగించాలని లేని పక్షంలో ఎవరు బ్యానర్ లు పెట్టిన పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది మౌనం గా ఉండాలని కొత్తమందినే టార్గెట్ చేయడం మంచిపద్దతి కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యానర్ లు వల్ల ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది పంచాయతీ వారే బాధ్యత వహించాలని వన్నె చింతలపూడి గ్రామస్తులు తెలిపారు.ఇప్పటికి అయిన అధికారులు జోక్యం చేసుకుని అందరికి సమాన న్యాయం చేయాలని, అలా చేయని యడల గ్రామంలో మరిన్ని బ్యానర్ లు ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.