విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*కిమ్స్ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం*
*పేరూరు సర్పంచ్ అరుణ డేవిడ్ అధ్యక్షతన*
అమలాపురం డిసెంబర్ 16 విశ్వం వాయిస్
అమలాపురం మండలం పేరూరు పంచాయతీ సర్పంచ్ అరుణ్ డేవిడ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం జరిగింది ఈ మెగా వైద్య శిబిరానికి కళ్ళకు, గుండెకు, కిడ్నీ, షుగర్ బీపీ వ్యాధికి సంబంధించిన రోగులకు పరీక్షలు ఈసీజీ ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా అందజేశారు.
ఈ మెగా వైద్య శిబిరం లో పాల్గొన్న వైద్యులు డాక్టర్ సావిత్రి కార్డియాలజిస్ట్, డాక్టర్ ఆశ జనరల్ మెడిసిన్, డాక్టర్ మనోహర్ ఆర్థోపెడిక్, డాక్టర్ తేజ డెంటల్, రత్నకుమారి డెంటల్, పంచాయతీ సిబ్బంది ఆర్ఎస్ఎస్ సూర్పరాజు ఎంపీటీసీ సభ్యులు చొల్లంగి సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.