విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి సిటీ:
కందులదుర్గేష్ ను విమర్శించే అర్హత వైసిపి నాయకులు లేదు
– జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ను,జనసేన పార్టీ కోసం మాట్లాడే అర్హత లేదని జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు అన్నారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సామాన్యుని గొంతుకను తెలిపే విధంగా నిర్వహించే ఉద్యమం గానీ,సమావేశాలు నిర్వహించుకునే హక్కు ను కాలారస్తూ జీవో నెంబర్ వన్ ను మా జనసేన పార్టీ తరపున మేము వ్యతిరేకిస్తున్నం అలాగే,అధికార దుర్వినియోగంతో జీవోలను పాస్ చేస్తూ సభలను అడ్డుకోవాలని చూడడం దారుణమని మొన్న రాజమండ్రిలో పెన్షన్ల పెంపు సిఎం సభ విషయంలో ప్రజలను ప్రలోభ పెడుతూ వారికి వచ్చే పథకాలను ఆపుతానని బెదిరించి సభకు తరలించిన వైనం దారుణమని మద్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగులో ఉందని జిల్లా ఏ విధంగా యువతను బానిసలుగా తయారు చేస్తున్నారని యువతకు ఉపాధి కల్పించే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చారని అందుకోసమే ఈనెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ ను నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు భారీ ఎత్తున యువత కదిలి రావాలని మన భవిష్యత్తు మన బాధ్యతని ఈ ప్రభుత్వం మద్యం మీద పెట్టిన దృష్టిని యువత భవిష్యత్తుపై పెట్టాలని రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని గెడ్డం నాగరాజు తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాజమండ్రి ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, నగర ప్రధాన కార్యదర్శి వెంకట పైడ్రాజు,నల్లంశెట్టి వీరబాబు,
జన సైనికులు విక్టరీ వాసు,సెశెట్టి ప్రసాద్,హేమ దుర్గ తదితరులు పాల్గొన్నారు.