విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం…
పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఏ జయ పాల్…
రాయవరం విశ్వం వాయిస్ న్యూస్: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంగా పాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అందుకు క్షేత్రస్థాయి అధికారుల కృషి ఎంతో అవసరమని పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ ఏ జయపాల్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన రాయవరం మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో అమూల్ డైరీ ప్రొడక్ట్స్ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, డ్వాక్రా సంఘ ప్రతినిధులు, వివిధ గ్రామాల పశుసంవర్ధ శాఖ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడి జయపాల్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగనన్న పాలవెల్లువ భాగంగా పథకంలో భాగంగా తొలి సమావేశం రాయవరం మండలంలో నిర్వహిస్తున్నామన్నారు.
జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అత్యధిక ధర చెల్లించేందుకు ప్రభుత్వ సంకల్పించింది అన్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో రైతాంగానికి పశుపోషకులకు అధికారులంతా సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో ఉన్న బల్క్ మిల్క్ సెంటర్ ద్వారా సుమారు 50 గ్రామాలకు పాడి రైతుల ద్వారా పాల సేకరణ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు పాల డైరీ కంటే అత్యధిక ధర అత్యధిక ధర రైతులకు చెల్లించేందుకు సంస్థ ముందుకు వచ్చింది అన్నారు. జిల్లాలో ఉన్న పాడి రైతుల డేటా సేకరించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ధర విషయంలో పాడి రైతులు మోసపోకుండా ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అమూల్ సంస్థ ద్వారా దళారి వ్యవస్థలేని పాల సేకరణ జరుగుతుందని తెలిపారు. ఒక రూటులో నాలుగు, ఐదు గ్రామాలకు పాల సేకరణ చేయుటకు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వి శివశంకర ప్రసాద్, రామచంద్రపురం ఏడి డాక్టర్ ఓ రామకృష్ణ రాయవరం పశువర్ధక శాఖ ఏడి బి అనిత కుమారి, మండపేట పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆర్ రాజ్ కుమార్, అముల్ డైరీ డైరీ ప్రొడక్ట్స్ ప్రతినిధులు దాస్ తివారి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మణికంఠ, ఫీల్డ్ సూపర్వైజర్ కిషన్,తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఎంపీడీవో డి శ్రీనివాస్, ఈవోపీఆర్డి ఏ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.