విశ్వంవాయిస్ న్యూస్, కమలాపురం:
*పరంజ్యోతి స్కూల్* *ఇంటర్నేషనల్ స్పోర్ట్స్* *
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ జనవరి 25
అమలాపురం ఎర్రవంతెన దగ్గర ఉన్న పరంజ్యోతి స్కూల్ నందు జనవరి 26,27,28 తేదీలలో బాస్కెట్ బాల్ మరియు ఫుట్ బాల్ శిక్షణా తరగతులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలందరికీ నిర్వహించడం జరుగుతుంది.పరంజ్యోతి విద్యాసంస్థల కమీషనర్ జాషువా కొమానపల్లి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచు కొనేందుకు సువిశాలమైన ఫుట్బాల్ మరియు బాస్కెట్ బాల్ కోర్టులు తయారుచేశామని వీటిద్వారా కోనసీమ ప్రాంతంలోవున్న విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారుచేయడానికి వీలు కలుగుతుందని , రాబోయే సంవత్సరాలలో పరంజ్యోతి స్కూల్ మంచి విద్యతో పాటు , అన్ని క్రీడలకు సంబందించిన క్రీడా వసతులను అంతర్జాతీయ స్థాయిలో తయారు చేస్తున్నామని తెలియచేసారు.డ్రిబిల్ అకాడమీ మరియు ఫుట్ బాల్ ప్లస్ అకాడమీల నుండి విచ్చేసిన అంతర్జాతీయ స్థాయి కోచ్ ల చేత శిక్షణా తరగతులు నిర్వహించబడును. ఈ శిక్షణా తరగతులకు కోనసీమ ప్రాంత వాసులందరూ పాల్గొనవచ్చు అని తెలియచేసారు. పాల్గొన్న ప్రతిఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికీ స్పెయిన్ దేశములోశిక్షణ పొందుకొనే అవకాశం కల్పించబడును. ఈ కార్యక్రమంలో పరంజ్యోతి స్కూల్ ప్రినిసిపాల్ డానియల్ మరియు వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ పాల్గొన్నారు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.