– బిజెపి నాయకులు మూడే సతీష్ కుమార్ నాయక్
– చోడవరంలో బిజెపి ఎటపాక మండల కార్యవర్గ సమావేశం
విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:
మండల పరిధిలోని చోడవరం గ్రామంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పేరాల రాజు అధ్యక్షతన మంగళవారం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు మోదుగు పెరమయ్య , యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడే సతీష్ కుమార్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఎటపాక కస్తూర్భా ఇంటర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ లేరని , వెంటనే మ్యాథ్స్ లెక్చరర్ ను నియమించాలని , పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గరీబ్ కళ్యాణ్ యోజన , ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో లబ్ధిదారులకు అందించడం లేదని , సకాలంలో లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన పథకం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం దానిని తమ పథకంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని , అటువంటి వాటిని తిప్పి కొట్టే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని , అలాగే బూత్ కమిటీలు మండల కమిటీ అన్ని మోర్చాల మండల కమిటీలు త్వరగా పూర్తి చేయాలని వారి సమావేశంలో చర్చించారు. అలాగే మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి గుండె ఊడే రమేష్, ఏం రామకృష్ణ , ఎస్సీ మోర్చా కె.రామకృష్ణ , ఓబీసీ మోర్చా , కనితి అజయ్ కుమార్ , పి.నాగరాజు , ఎం.రాములు గ్రామస్తులు పాల్గొన్నారు.