విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డ్ ఆంధ్రా నగర్ ప్రార్దన మందిరం సంఘం సభ్యులు మరియు చర్చ్ కమిటీ అధ్వర్యంలో శనివారం ఉదయం రక్షణ సువార్త పరిచర్య అడ్డతీగల,వై రామవరం మండలాల్లో పలు గిరిజన ప్రాంతాల్లో సువార్త ప్రకటనను నిర్వహించారు.ఈ కార్యక్రమం బ్రదర్ చంద్రమళ్ల రాజు మాస్టర్ పర్వవేక్షణలో కొనసాగింది.సువార్తను ప్రకటించిన దైవజనులు బ్రదర్ భానుచంద్ర,బ్రదర్ బాలు జోసెఫ్,బ్రదర్ రాజా రమేష్,బ్రదర్ మార్క్ వారి సతీమణి సువార్తను ప్రకటించారు.సంఘ సభ్యులు గిరిజనులకు బైబిల్స్ కరపత్రాలు పంచుతూ,అలాగే దాతలు మరియు సంఘ సభ్యులు సొంత ధనం వెచ్చించి నూతన వస్త్రాలు,పాత వస్త్రాలు సహోదర సహోదరులు ఇంటఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తూ వారు అవసరతలు నిమిత్తం ప్రార్దన చేయుచూ, యేసుక్రీస్తును అంగీకరించండి మీ సమస్త రుగ్మతలు తొలగిస్తాడు,నిజమైన దేవునిని నమ్ముట ద్వారా రక్షణ పొందాలి,నశించి పోవుచున్న వారి సువార్త ప్రకటించుటకు మీ గ్రామాలకు రావడం జరిగింది అని దైవజనులు ప్రార్థనతో అయా గ్రామాల్లో సువార్త పరిచర్య మహిమ కరంగా సాగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రానగర్ ప్రార్దన మందిరం సంఘ సభ్యులు,కమిటీ పెద్దలు,మహిళలు, యూత్ సభ్యులు,సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు.