విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
దివ్యాంగ చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష సీఎంవో చామంతి నాగేశ్వరరావు వెల్లడి
దివ్యాంగ చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూడాలని కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష సీఎంవో చామంతి నాగేశ్వరరావు మండలంలోని గాడి మొగ పంచాయతీ లక్ష్మీపతి పురంలోని భవిత ఫిజియోథెరపీ ఆయన పరిశీలించారు. అక్కడ చేస్తున్న సేవలు సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి దివ్యాంగ చిన్నారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పి మల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తాళ్లరేవులోని జై భీమ్ పేట ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మల్లవరం పాఠశాల ఉపాధ్యాయిని మోకా ఉమ, సిఆర్పి తరాల మీరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.