విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం:
“ఎయిమ్స్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు*
ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్ మార్చి 7:
మహిళలు స్వతంత్రంగా ఆర్థిక పరిపుష్టి సాధిం చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎయిమ్స్ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ఘనంగా వేడుక లను నిర్వహిం చారు. ఈ సందర్భం గా ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల మన ఆలోచన ధోరణిలో మార్పు రావా ల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు. సమాజ నిర్మాణంలో సగభాగ మైన స్త్రీ సమానత్వమే మన ప్రగతి కి మూలమని ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహి స్తోందన్నారు సమాజంలో మహి ళలు ఆత్మ గౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోని నిరంతర జీవ నాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నా రన్నారు . మానవ వనరుల సంపూ ర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా ఎంత ఉందని, ఏ రంగంలోనై నా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామే మీ తీసిపోమని చాటి చెబుతున్నారన్నారు. మహి ళలు ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదని ఆయన స్పష్టం చేశారు. .మహిళా సాధికారత అనేది నాణ్యమైన జీవితానికి దారితీసే అన్ని రంగాల నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళలకు భాగస్వామ్య శక్తిని సూచిస్తుం దన్నారు. మహిళా సాధికారత అనేది ఆలోచనలు, హక్కులు, నిర్ణయాలు, చర్యల యొక్క అన్ని అంశాలలో స్త్రీలను స్వతంత్రంగా మార్చే ప్రక్రియని, మహిళా సాధికారత సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహి స్తుందన్నారు.కుటుబ, సమాజం అభివృద్ధి చెందడానికి మహిళా సాధికారత అవసరమని భారత రాజ్యాంగం ప్రకారం ”సమాన త్వ హక్కు’ చట్టం భారతదేశంలోని మహిళలకు సాధికారత కల్పించడం లో సహాయపడుతుందన్నారు. మహిళా సాధికారత అనేది మహి ళలకు ఉపాధి, విద్య మరియు ఆర్థికాభివృద్ధికి సమాన అవకాశా లను కల్పిస్తుందన్నారు. విద్యా వంతులైన స్త్రీలు జీవితంలో చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకో గలుగుతారని, మహిళలను సాధికారత కల్పించడంలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు భారత ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’, ‘ఉజ్వల పథకం’, ‘మహిళా శక్తి కేంద్రాలు’ వంటి మహిళలకు సాధికారత కల్పించే వివిధ పథకా లను ప్రారంభించి,మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటు న్నారని తెలిపారు. మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించు కోవడం జరిగిందన్నారు.సమాజ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహా యపడుతున్నారన్నారు ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యా న్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి అంత ర్జాతీయ మహిళా దినోత్సవo దోహధపడుతోందన్నారు. మహి ళలుగా తన తల్లి మరియు భార్య తాను ఉన్నత స్థితికి చేరుకో వడంలో ఎంతో తోడ్పాటు అందిం చారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకుంటున్న వారిలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారని గుర్తు చేశారు. మగవారి కంటే మహిళలు శారీర కంగా మానసికంగా ఎంతో దృఢ త్వాన్ని కలిగి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కే లతా మాధురి ఐసిడిఎస్ పిడి జివి సత్యవాణి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కే తులసి ఉపాధి కల్పనాధికారి, వసంతలక్ష్మి అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిహెచ్ వి భరత్ లక్ష్మి ,సాంఘిక సంక్షేమ అధికారి పి జ్యోతిలక్ష్మి దేవి డిఈఓ ఎం కమల కుమారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నాగలక్ష్మి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడి కే విశాలాక్షి ల ను ఈ సందర్భంగా ఘనంగా మెమొంటోతో సత్కరిం చారు. అదేవిధంగా సోషల్ బిహేవియర్ చేంజ్ అంశంలో కీలకంగా వ్యవహరించిన, విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళా అధికారులకు ప్రశంసా పత్రాలు మెమొంటోతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ సిడిపిఓలు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.