Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నాలుగేళ్ల అంతర కబడి అసోసియేషన్ వివాదానికి తెర

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

*నాలుగేళ్ళ ఆంధ్ర కబడ్డి అసోసియేషన్ వివాదానికి తెర*

 

*అధ్యక్షులుగా గొలుగూరి వెంకట్ రెడ్డి (విక్టరీ రెడ్డి), కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్ నియామకం*

 

రావులపాలెం(విశ్వం వాయిస్) ఆంధ్ర కబడ్డీ అసోషియేషన్లో గత నాలుగు సంవత్సరాలు గా ఉన్న వివాదానికి శనివారం తెరపడింది. నూతన అధ్యక్షులుగా మరోసారి గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకట్ రెడ్డి), కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈసందర్భంగా, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎ కె ఎఫ్ ఐ) వారు గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకట్ రెడ్డి), ఎలమంచిలి శ్రీకాంత్ అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగుతున్న సంఘానికె గుర్తింపునిస్తూ ఏకే ఎఫ్ ఐ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో రెండు వర్గాలుగా వున్న అసోసియేషన్ వారు పరస్పరం రాష్ట్ర హైకోర్టు ఢిల్లీ కోర్టులో కేసులు దాఖలు చేసుకున్నాయి వాటిపై ఇటీవల కోర్టు తీర్పులను విలువరించాయి ఆయా తీర్పులను ఈనెల 20వ తేదీ నుంచి అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎస్టి గార్గ్ పరిశీలించి ఇరు వర్గాలను ఢిల్లీకి పిలిచి విచారణ చేశారు కోర్టు తీర్పులు వెంకటరెడ్డి శ్రీకాంత్ ల వర్గానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వారి నేతృత్వంలోని అసోసియేషన్కు ఫెడరేషన్ గుర్తింపునిచ్చింది అదేవిధంగా కేఈ ప్రభాకర్,వీర్లంకయ్య లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ఎన్,ఎస్,డి,సి ప్రకారం సంఘంలో ప్రతినిధులుగా కొనసాగడానికి అనర్హులని ఏకే,ఎఫ్,ఐ ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు సి. ఆర్. సి కార్యవర్గ సభ్యులు గొలుగూరి వెంకట్ రెడ్డి(విక్టరీ వెంకట్ రెడ్డి), ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్, సి. ఆర్. సి కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి,పశ్చిమగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై.శ్రీకాంత్,ఎన్ అర్జునరావు గారు సి ఆర్ సి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ వీర్రాఘవరెడ్డి సి ఆర్ సి స్పోర్ట్స్ డైరెక్టర్ ఏ రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ, పిఎస్ఎన్ మల్లేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లా కబడ్డి అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ, బి.గంగా మహేష్ నాయుడు పశ్చిమగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement