WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

చక్కటి నైపుణ్య అభివృద్ధితో మహిళలు జీవితానికి బాటలు వేసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం రూరల్:

చక్కటి నైపుణ్య అభివృద్ధితో జీవితానికి మహిళలు బాటలు వేసుకోవాలి

 

పేరూరు గ్రామపంచాయతీ ఉపాధ్యక్షులు కుడిపూడి సత్యనారాయణ ( మాస్టర్)

 

 

అమలాపురం. రూరల్ విశ్వం వాయిస్ న్యూస్ ఏప్రిల్ 05

 

 

స్వచ్ఛంద సేవా సంస్థలు మహిళలకు అందిస్తున్న శిక్షణ వంటి సహాయ సహకారాలను అందిపుచ్చుకుని చక్కటి నైపుణ్యంతో మీ అభివృద్ధికి మీరే తొలిమెట్టును రూపొందించుకోవాలని పేరూరు గ్రామ పంచాయితీ ఉపాధ్యక్షులు కుడుపూడి సత్యనారాయణ అన్నారు. ప్రియదర్శిని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 3 నెలలు కుట్టు మిషను శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను బుధవారం అందజేశారు. ముఖ్యాతిధిగా పాల్గొన్న సత్యనారాయణ మాస్టారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందు ఉంటున్నారని స్వచ్ఛంద సేవ సంస్థలు అందిస్తున్న ప్రోద్బలంతో మహిళలు మరింత అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. శిక్షణ అనంతరం శిక్షణ తీసుకున్న మహిళలు ఒక బృందంగా ఏర్పడి షాపులను ఏర్పాటు చేసుకొని తమ తమ కాళ్లపై నిలబడే విధంగా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సెంటర్ కోఆర్డినేటర్ ఎం. జ్యోతి, ట్రైనర్ జి. గంగాభవాని శిక్షణ తీసుకున్న మహిళలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement