విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:
ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, రామతీర్థంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే గంగమ్మ తల్లి తిరుణాల జాతరలో ప్రకాశం జిల్లా తెదేపా నాయకులు సందడి చేశారు.
ముందుగా తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ప్రభల వద్దకు బాపట్ల పార్లమెంటు తెదేపా పార్టీ అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు బి.యన్ విజయ్ కుమార్, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర తెదేపా ఆర్గనైజేషన్ సెక్రెటరీ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ముఖ్య అతిథలుగా హాజరై కొంచెం సేపు కార్యకర్తలతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో చీమకుర్తి పట్టణ తెలుగుదేశం నాయకులు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అభిమానులు, భక్తులు విరివిగా పల్గొన్నారు