జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్ళరేవులోని స్థానిక బాప్టిస్ట్ చర్చి ఆవరణలో కాకినాడ జిల్లా పిఠాపురం సిఎంసి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్ అధ్యక్షతన కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య శిబిరాన్ని ముందుగా సామ్యూల్ సాగర్ చేతుల మీదుగా ప్రారంభించి, అనంతరం కంటి సమస్యలతో ఉన్న బాధితులను పరామర్శించారు. సుమారుగా 400 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంసి ఆసుపత్రి వైద్యులు, స్థానిక వైసిపి నాయకులు, క్రీం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.