విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్:
గృహించకు పాల్పడిన ముద్దాయిలకు పది సంవత్సరాలు జైలు శిక్ష 10, వేలు జరిమానా
ఎనిమిదవ ఎడిజే అండ్ సెషన్స్ కోర్ట్ రాజమండ్రి
మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు
సత్ఫలితాలు ఇస్తున్న ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్
అమలాపురం విశ్వం వాయిస్ (ఎస్పీ కార్యాలయం)న్యూస్
డా: బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,
* 2018 వ సంవత్సరం అమలాపురం పట్టణ పరిధిలో విద్యుత్ నగర్ నందు గృహహింసకు పాల్పడి ఒక స్త్రీ మరణమునకు కారణమైన కేసులో ముధ్ధాయి లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు 10,000/- జరిమానా విధించిన ఎనిమిదవ ఎడిజే అండ్ సెషన్స్ కోర్టు రాజమండ్రి.
వివరాల్లోకి వెళితే
**2018 వ సంవత్సరం నకు ముందు అమలాపురం విద్యుత్ నగర్ కు చెందిన రావూరి వెంకటేశ్వరరావు అమ్మాయి అరుణాదేవిని ఫ్రెంచి యానంకు చెందిన కామిశెట్టి వెంకట పెరుమాళ్ళు కు కట్న కానుకలు ఇచ్చి ఇచ్చి వివాహం చేయగా తదనంతరం వారి తల్లిదండ్రులు ఆడపడుచు కలిసి చేసిన అదనపు కట్నం వేధింపుల విషయమై తీవ్ర మానసిక వేదనకు గురై తల్లి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోగా బాధితురాలి తల్లి తండ్రులు రావూరి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు సి ఆర్ నెంబర్.362/2018 యు/ఎస్ 304-బి ఆర్ .డబ్ల్యు 34 I ఐ పి సి కేసుగా నమోదు చేయగా, అప్పటి అమలాపురం ఎస్ డి పి ఓ ఏ వి ఎల్ ప్రసన్నకుమార్ సమగ్ర దర్యాప్తు చేపట్టి గౌరవ కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.
తదుపరి జరిగిన విచారణ నందు రాజమండ్రి 8వ ఏడిజె , సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రొసీక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించగా, గౌరవ కోర్ట్ జడ్జి పీవీ రాజీవ్ కేసు విచారణ అనంతరం, ముద్దాయి పై నేరం రుజువు అయినందున, ముద్దాయి లు కామిశెట్టి వెంకట పెరుమాళ్ళు, తండ్రి కామిశెట్టి తిరు కోటేశ్వరరావు, తల్లి కామిశెట్టి చిన అమ్మాజీ, ఆడపడుచు నామాని త్రినాధేశ్వరి లకు 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 10,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
*ఈ కేసు దర్యాప్తు లో నిందుతునికి శిక్ష పడడంలో ప్రత్యేకంగా కేసు విచారణ జరుగుతున్న సమయంలో, కోర్టునకు హాజరై, కేసు విచారణ సమయములో ఏ విధమైన ఆలస్యం చేయకుండా సాక్షులను ప్రవేశపెట్టి, పి.పి కి అవసరమైన కేసు సంభందించిన రికార్డు లను సమకూర్చి, నేరస్తునికి శిక్ష పడడంలో ఎంతో కృషి చేసిన కోర్ట్ కో -ఆర్డినేటర్ గా ఉన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె..అప్పలస్వామి – డా; బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , ప్రాసిక్యూషన్ తరపున వాధించిన పబ్లిక్ ప్రొసిక్యుటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ని, దర్యాప్తు అధికారులైన అప్పటి అమలాపురం ఎస్ డి పి ఓ ఏ వి ఎల్ ప్రసన్నకుమార్ మరియు ప్రస్తుత సి ఐ ,డి .దుర్గా శేఖర్ రెడ్డి లను డా; బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ప్రత్యేకం అభినందిచారు.*