విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్:
*అకాల వర్షంతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. హరీష్ బాలయోగి*
ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని..
జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన
టిడిపి పార్లమెంట్ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి…
అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి లేఖ రాశారు.అకాల వర్షం జిల్లాలో రైతులను నిండా ముంచిందని వరి రైతులే కాకుండా ఇతర పంట రైతులకు కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లిందని పంట చేతికి వచ్చే సమయంలో వర్షం వల్ల రైతులు ఇబ్బందులకు గురయ్యారని,కావునా ప్రభుత్వం తరుపున రైతులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పంట నష్టం అంచనాలను వేసి వాటిని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాల్సిందిగా కోరారు. ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం అందించేలా చూడాలని అలాగే కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు. తడిచిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అలాగే లంక ప్రాంతాలలో అంతర పంటలకు సైతం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. తొలకరి పంటలో నష్టం వాటిల్లినా దాళ్వా సాగుతో కొంతమేర నష్టాల నుండి బయటపడొచ్చనుకున్న రైతులు ఈ పంటలో కూడా నష్టపోయారని ఈ లేఖలో తెలియజేశారు.
కావునా తగు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని హరీష్ బాలయోగి కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.