విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు మండలం:
చదువులమ్మ చెట్టు నీడన..
,,…….,……………………….
పాటశాల అంటేనే మధుర స్మృతుల నిలయం. మధురానుభూతులకు కొదవే ఉండదు.అందుకే ఆ పాఠశాల చదువుకుని ఎన్నేళ్ళు అయినా ఆ బాల్య స్మృతులు మాత్రం ఏ ఒక్కరూ మరిచిపోలేరు.నేటి ఒత్తిడిమయ జీవితంలో చిన్న నాటి పాటశాలను.. సహచర బాల్య మిత్రులను తలుచుకుంటే చాలు మనస్సు ఆనంద పారవశ్యం అవుతుంది.నాలుగు దశాబ్దాల క్రితం సరస్వతీ నిలయం అయిన ఆ చదువులమ్మ చెట్టు నీడన చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం అదే పాటశాలలో మరోసారి కలుసుకుని ఆనంద పరవశులయ్యారు.
మోరి శ్రీమతి జాన సుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1979_84 లో ఆరు నుంచి పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఎక్కడెక్కడో స్థిర పడ్డా తిరిగి అదే చదువులమ్మ ఒడిలో బుద్దిగా ఒదిగి పోయారు.అలనాటి మధుర స్మృతులను తలుచుకుని విద్యార్థులుగా మారిపోయి సందడి చేశారు.
ఒరేయ్ రాపాక ఎలా ఉన్నావు..నల్లోడు ఏమి చేస్తున్నాడు..ఎక్కడ ఉన్నాడు. మాధవ గాడు అలాగే ఉన్నాడా. పమ్మోడి కి కబురు అందిందా.ఎంత కాలమైందిరా ఇలా కలుసుకుని..ఈ ఆనందాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేమంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనంద పరవశులు అయ్యారు. రాష్ట్ర రాస్ట్రేతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పలకరింపులతో పులకరించి పోయారు.అలనాటి గురువులను చూసి తన్మయత్వానికి గురైన వారు కొందరైతే తమ ఉన్నతికి కారణం మీరెనంటూ పాదాభివందనం చేసిన వారు మరి కొందరు.నాటి గురువుల ముందే చిలిపి పనులను గుర్తు చేసుకున్నారు. అలనాటి తరగతి గదుల్లో తిరుగుతూ సందడి చేశారు.
తొలుత అలనాటి విద్యార్థినులు గుత్తి సుబ్బలక్ష్మి..సరెళ్ళ.పద్మ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు Dr. ఆకుల వెంకట రామ్మోహనరావు అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థుల పరిచయం అనంతరం ఆట పాటలతో ఆనందంగా గడిపారు.అనంతరం అలనాడు విద్యాబుద్దులు నేర్పించిన గురువులు మైలవరపు లక్ష్మి నరసింహారావు.. పెద్దిరెడ్డి సుబ్బారావు.. చింతా ఆనందరావు.. కట్టా సూర్యనారాయణ రావు.. మల్లాది విజయ లక్ష్మి.. ఉండ్రు శిరోమణి..లకు దుస్సాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ ప్రతినిధులు రాపాక పెద్దిరాజు.. ఉప్పుగంటి నాగ మల్లేశ్వరరావు..శ్రీపాద వెంకటేశ్వర్లు.. పసలపూడి శ్రీనివాసరావు.. కామిశెట్టి మాచరమ్మ.. గానాల మోహన వెంకట కృష్ణారావు.. బళ్ల మహాత్మా గాంధీ.. కాశిన సూరన్న తదితరులు పాల్గొన్నారు. వెలివెల శ్రీ ప్రణవ మైతిల్వ నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.